VV Vinayak: మెగా కాంపౌండ్ లో వినాయక్..! చిరంజీవి కోసం కథ..!?

vv vinayak readying script for chiranjeevi
Share

VV Vinayak: వివి వినాయక్ VV Vinayak తెలుగు తెరపై మాస్ మంత్రాన్ని కొత్తగా చూపిన దర్శకుడు. టాలీవుడ్ రాయలసీమ ఫ్యాక్షనిజాన్ని, ఫైట్స్, సుమోలు గాల్లో లేపడం.. వంటి వాటిల్లో ఒక స్పెషలైజేషన్ క్రియేట్ చేసుకుని అగ్ర దర్శకుడిగా మారిపోయాడు. మెగాస్టార్ చిరంజీవి ఇచ్చిన అవకాశాన్ని వంద శాతం సద్వినియోగం చేసుకుని ఠాగూర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చాడు. దీంతో వినాయక్ పేరు మోగిపోయింది. ఏకంగా చిరంజీవి తన కమ్ బ్యాక్ మూవీ ఖైదీ నెంబర్ 150ని వినాయక్ చేతుల్లో పెట్టడం.. ఆ సినిమా నాన్ బాహుబలి కేటగిరీలో ఇండస్ట్రీ హిట్ కావడం కూడా జరిగిపోయింది. ఇప్పుడు మళ్లీ మెగా కాంపౌండ్ లో వినాయక్ చేరబోతున్నాడని తెలుస్తోంది.

vv vinayak readying script for chiranjeevi
vv vinayak readying script for chiranjeevi

నిజానికి.. చిరంజీవి చేస్తున్న మళయాళ రీమేక్ లూసిఫర్ మొదట సుజిత్ నుంచి వినాయక్ కే చేరింది. రీమేక్స్ తోనే మెగాస్టార్ కు బంపర్ హిట్స్ ఉన్న రికార్డ్ ఉండటంతో లూసిఫర్ కూడా వినాయక్ కే వెళ్తుందని అందరూ అనుకున్నారు. సిట్టింగ్స్ కూడా జరిగాయి. కానీ.. అనుకున్న మార్పులు చేయలేదనే టాక్ తో ప్రాజెక్టు తమిళ దర్శకుడు మోహన్ రాజాకు చేరింది. ఇప్పుడు వినాయక్ పట్టు వదలకుండా మళ్లీ మెగాస్టార్ కోసం కథ రెడీ చేసినట్టు ఇండస్ట్రీ టాక్. ఇప్పటికే చిరంజీవిని కలిసి కథ వినిపించినట్టు కూడా సమాచారం. అయితే.. చిరంజీవి ఇంకా ఏం చెప్పలేదని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి వరుసగా నాలుగు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఇవి పూర్తైతే కానీ.. కొత్త సినిమాపై ఫోకస్ పెట్టలేని పరిస్థితి.

Read More: Chiranjeevi: చిరంజీవి మరో సేవ..! జిల్లాకో ‘చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్’ ఏర్పాటు

మరోవైపు.. పవన్ కల్యాణ్ తో కూడా వినాయక్ సినిమా చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. పవన్ ను డైరక్ట్ చేయాలనేది కూడా తన డ్రీమ్ అని వినాయక్ గతంలోనే చెప్పాడు. పొలిటికల్ టచ్ ఉండేలా యాక్షన్ మూవీ కాన్సెప్ట్ తో ఓ కథ రాయిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్తలు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. వరుస ఫ్లాపులతో వినాయక్ ప్రస్తుతం కాస్త డీలా పడ్డాడు. బెల్లంకొండ శ్రీనివాస్ తో చత్రపతి హిందీ రీమేక్ చేస్తున్నాడు. మెగా బ్రదర్స్ తో సినిమా అనే వార్తలు ప్రస్తుతానికి గాసిప్ లా ఉన్నా ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. సరైన కథ పడితే వినాయక్ మళ్లీ బౌన్స్ బ్యాక్ కావడం ఖాయం. దీనిపై అఫిషియల్ న్యూస్ రావాల్సి ఉంది.

 


Share

Related posts

Vijay devarakonda : విజయ్ దేవరకొండ హీరోగా కాదు నిర్మాతగా చాలా బిజీ

GRK

విజయ్ సేతుపతి వల్ల అది సాధ్యపడలేదట.. అందుకే తీసి పక్కన పెట్టారు ..?

GRK

రీల్ కోసం రియల్ ట్రైనింగ్

Siva Prasad