NewsOrbit
Entertainment News సినిమా

Prabhas: ఇంకెప్పుడూ ఎవ్వడూ ప్రభాస్ సినిమా లీక్ చెయ్యడు – కల్కి లీక్ చేసిన వాళ్లకి అతిపెద్ద కోర్టు శిక్ష !

Advertisements
Share

Prabhas: బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిలిం ఇండస్ట్రీ వరకు ప్రెస్టేజీఎస్ ప్రాజెక్టులకు లీకుల బెడద ఎక్కువైపోయింది. చాలామంది స్టార్ హీరోల సినిమాలకు సంబంధించిన షూటింగ్స్ అన్ని వేషాలు లేదా ఎడిటింగ్ రూమ్లో జరిగే వాటికి సంబంధించి సోషల్ మీడియాలో లీక్ అవుతున్నాయి. కొన్ని రోజుల క్రితం రామ్ చరణ్ ప్రజెంట్ నటిస్తున్న “గేమ్ చేంజర్” కి సంబంధించిన సాంగ్ రిలీజ్ అయింది. కాక తాజాగా ప్రభాస్ కెరియర్ లో అత్యంత హై బడ్జెట్ సినిమా.. కల్కి నుండి కూడా పిక్ లీక్ కావటం జరిగింది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి నెలలో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో ఒక్కసారిగా కల్కి మూవీ సినిమాలో ప్రభాస్ ఫోటో లీక్ కావటం సంచలనంగా మారింది.

Advertisements

Vyjayanthi Movies producers legal action those who leaked kalki prabhas poster

పాన్ ఇండియా నేపథ్యంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకి హాలీవుడ్ టెక్నాలజీతో సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన అమితాబ్, దీపికా పదుకొనే, దీక్ష పటాన్ని వంటి నటీనటులు నటిస్తున్నారు. వైజయంతి మూవీస్ బ్యానర్ లో ఇది 50వ సినిమాగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎన్నో ప్రత్యేకతలు సంతరించుకున్న కల్కి నుండి.. ప్రభాస్ ఫోటోలు సినిమా యూనిట్ కి సంబంధం లేకుండా విడుదల కావడంతో తప్పు.. ఎక్కడ జరిగిందో మేకర్స్ ఎంక్వయిరీ చేయడం జరిగింది. ఈ క్రమంలో సినిమాకి సంబంధించి జరుగుతున్న విఎఫ్ఎక్స్ కంపెనీ నుండి.. ఈ లీక్ జరిగినట్లు సినిమా యూనిట్ కన్ఫామ్ చేయడం జరిగింది.

Advertisements

Vyjayanthi Movies producers legal action those who leaked kalki prabhas poster

దీంతో ఆ కంపెనీ పై అతిపెద్ద కోర్టు శిక్ష పడే రీతిలో.. న్యాయ పోరాటానికి దిగటంతో సదరు కంపెనీ అప్రమత్తమయ్యింది. కల్కి సినిమాకి సంబంధించి వర్క్ చేస్తున్న వ్యక్తిని వెంటనే తొలగించడం జరిగింది. అయినా వైజయంతి మూవీస్ నిర్మాతలు లీక్ చేసిన వ్యక్తినీ ఊరికినే వదిలిపెట్టలేదు. క్రిమినల్ కేసు పెట్టడంతో పాటు సదరు కంపెనీపై పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆ కంపెనీ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం. ఈ దెబ్బతో ఇంకెప్పుడూ ఎవడు కూడా ప్రభాస్ సినిమా లీక్ చెడు అంటూ వార్తపై అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.


Share
Advertisements

Related posts

Anupama-Pawan Kalyan: ప‌వ‌న్ గురించే నేను మాట్లాడ‌ను.. అనుపమ షాకింగ్ కామెంట్స్!

kavya N

Dj Tillu Hero: `డీజే టిల్లు` హీరోతో స్టార్ డైరెక్ట‌ర్ సినిమా..విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు బిగ్ ఝులక్?

kavya N

Nagarjuna: వచ్చే వారం నుండి రెడీ అయి పోతున్న కింగ్ నాగార్జున..??

sekhar