Waltair Veerayya: డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి మరియు రవితేజ కలిసి నటిస్తున్న సినిమా “వాల్తేరు వీరయ్య”. ఇటీవలే సినిమాకి సంబంధించి టైటిల్ ప్రకటించడం జరిగింది. అయితే తాజాగా మరో అప్డేట్ సినిమా యూనిట్ అధికారికంగా తెలిపింది. మేటర్ లోకి వెళ్తే ఈ సినిమాకి సంబంధించి ఒక స్పెషల్ సాంగ్ షూట్ చేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో పాటు రవితేజ స్టెప్ లు వేస్తున్నారట. మాస్ సాంగ్ బిట్స్ కి ఇద్దరు హీరోలు డాన్స్ వేస్తున్నట్లు.. ప్రస్తుతం ఈ సాంగ్ షూట్ జరుగుతున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా స్పష్టం చేసింది. ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.
చిరంజీవి సరసన శృతిహాసన్ హీరోయిన్ గా చేస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న “వాల్తేరు వీరయ్య” సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల కానుంది. రవితేజ సరసన కేథరిన్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు సమాచారం. ఇటీవలే విడుదలైన టైటిల్ టీజర్ లో చిరంజీవి లుక్ అత్యంత మాస్ తరహాలో ఉంది. కమర్షియల్ ఎంటర్టైనర్ గా సినిమా తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది.
ముఠామేస్త్రి, గ్యాంగ్ లీడర్.. రిక్షావోడు తరహాలో వాల్తేరు వీరయ్య లో చిరంజీవి మాట తీరు కనిపిస్తుంది. చాలా వరకు మాస్ ఆడియన్స్ నీ టార్గెట్ చేసుకొని తీసినట్లు అర్థమవుతుంది. ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” సినిమాతో అట్టర్ ఫ్లాప్ అందుకోవడం జరిగింది. ఇక దసరా పండుగ నాడు “గాడ్ ఫాదర్” తో అదిరిపోయే విజయాన్ని చిరంజీవి అందుకున్నారు. మరి వచ్చే ఏడాది సంక్రాంతి పండుగకు విడుదల కానున్న ఈ సినిమా ఏ మాత్రం ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి.