Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు చేయడంలో మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” సినిమాతో ప్రేక్షకులను పలకరించి పరాజయం అందుకోవడం జరిగింది. ఆ తర్వాత “గాడ్ ఫాదర్” తో ఇటీవల మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చి అద్భుతమైన విజయాన్ని ఖాతాలో వేసుకున్నారు. దసరా పండుగ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో అలరించింది. ఇదిలా ఉంటే సంక్రాంతి పండుగకు “వాల్తేరు వీరయ్య” సినిమాతో బాక్సాఫీస్ వద్ద సందడి చేయడానికి చిరంజీవి రెడీ అయిపోయారు.
బాబీ దర్శకత్వం ఎక్కుతున్న ఈ సినిమాలో చిరంజీవితో పాటు మాస్ మహారాజా రవితేజ కూడా నటిస్తున్నారు. దాదాపు 20 సంవత్సరాల తర్వాత ఒక ఫుల్ లెన్త్ రోల్ లో చిరంజీవి పక్కన రవితేజ కనిపిస్తూ ఉండటంతో సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. శృతిహాసన్ ప్రధాన హీరోయిన్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ మందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఇటీవల దీపావళి పండుగ సందర్భంగా “వాల్తేరు వీరయ్య” గా టైటిల్ ప్రకటన చేస్తూ టీజర్ రిలీజ్ చేశారు. చాలా కొత్తగా టీజర్ లో చిరంజీవి కనిపించడంతోపాటు ఫుల్ మాస్ కంటెంట్ కలిగిన సినిమా అని దర్శకుడు క్లారిటీ ఇచ్చేసాడు.
దీంతో యూట్యూబ్ లో “వాల్తేరు వీరయ్య” దడదడలాడిస్తోంది.కాగా ఆరంభంలో “మెగా 154″… వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంది. ఆ టైంలోనే “వాల్తేరు వీరయ్య” గా సినిమా టైటిల్ ప్రచారం జరిగింది. అదే టైటిల్ ఇటీవల ప్రకటించడం విశేషం. ఇదంతా పక్కన పెడితే దీపావళి కానుకగా విడుదలైన “వాల్తేరు వీరయ్య” టైటిల్ టీజర్ యూట్యూబ్ లో నెంబర్ వన్ ట్రెండింగ్ లో నిలిచి దుమ్మురేపుతుంది. 9 మిలియన్ల వ్యూస్ తో… దూసుకుపోతుంది. సంక్రాంతి పండుగకు థియేటర్ లలో “వాల్తేరు వీరయ్య” సందడి చేయనుంది.