Waltair Veerayya: మెగాస్టార్ చిరంజీవి సినిమాలు ఒప్పుకోవడంలో మరియు కంప్లీట్ చేయడంలో మంచి స్పీడ్ మీద ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో “ఆచార్య” సినిమా రిలీజ్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన “ఆచార్య” బాక్సాఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అయ్యింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవితో పాటు చరణ్ నటించడంతో … సినిమాపై అంచనాలు ఓ రేంజ్ లో ఫ్యాన్స్ పెట్టుకోవడం జరిగింది. కానీ సినిమాలో దమ్ము లేకపోవడంతో చతికల పడింది. అనంతరం దసరా పండుగకు “గాడ్ ఫాదర్” తో ప్రేక్షకులను పలకరించి అద్భుతమైన విజయాన్ని చిరంజీవి సొంతం చేసుకున్నారు.
డైరెక్టర్ మోహన్ రాజా చిరంజీవిని అద్భుతంగా చూపించారు. మాటలు తక్కువ కనుసైగలతో శాసించే రీతిలో.. చిరంజీవి పాత్రని అద్భుతంగా తీర్చిదిద్దడం జరిగింది. కాగా ఇప్పుడు డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో చిరంజీవి వాల్తేరు వీరయ్య అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి విడుదల కానుంది. చిరంజీవితో పాటు రవితేజ కీలకపాత్రలో నటిస్తున్నాడు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ సింగిల్ ఈనెల 23వ తారీకు సాయంత్రం 4.05 గంటలకు ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తున్నట్లు సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ సినిమాలో శృతిహాసన్, కేథరిన్ తెరిసా.. హీరోయిన్ పాత్రలో నటించారు. బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేలా టైటిల్ సాంగ్ లో చిరు సరసన ఆడిపాడింది. ఫుల్ మాస్ క్యారెక్టర్ లో చిరంజీవి ఈ సినిమాలో కనిపిస్తున్నారు. ఇటీవలే “వాల్తేరు వీరయ్య” గ్లింప్స్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ వీడియోలో చిరంజీవి లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. దీంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.