Waltair Veerayya: బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా “వాల్తేరు వీరయ్య” సినిమా విడుదలవుతున్న సంగతి తెలిసిందే. సంక్రాంతి పండుగ నేపథ్యంలో జనవరి 13వ తారీకు ఈ సినిమా రిలీజ్ కానుంది. దీంతో సినిమాకి సంబంధించి ప్రమోషన్ కార్యక్రమాలు మెల్లమెల్లగా స్టార్ట్ అవుతున్నాయి. కాగా ఇప్పటికే కొన్ని పాటలు విడుదలయ్యాయి. ఇటీవల “వాల్తేరు వీరయ్య” సినిమా సెట్ లో చిరంజీవితో పాటు.. నటించిన హీరో రవితేజ దర్శకుడు బాబి ఇంకా దేవిశ్రీప్రసాద్, రాజేంద్రప్రసాద్ పలువురు నటీనటులు పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా సినిమా కచ్చితంగా సూపర్ డూపర్ హిట్ అవుతుందని అందరూ గ్యారెంటీ ఇస్తూ మాట్లాడారు.

అప్పట్లో “శంకర్ దాదా ఎంబిబిఎస్” తరహా కామెడీ.. శ్రీకాకుళం యాస భాషలో… ఈ సినిమాలో కామెడీ జోనర్ ఉంటుందని చిరంజీవి తెలిపారు. కచ్చితంగా అందరూ ఇది నవ్వుకుంటూ ఎంజాయ్ చేసే సినిమా అని తెలియజేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఈరోజు “వాల్తేరు వీరయ్య”లో పూనకాలు లోడింగ్ అనే సాంగ్ రిలీజ్ చేశారు. థియేటర్ లో ఈ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటకి అభిమానుల నుండి భారీ ఎత్తున మంచి రెస్పాన్స్ వస్తుంది.

చిరంజీవి వేస్తున్న స్టెప్పులు అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ చివరిలో రవితేజ కూడా రావటం జరిగింది. ఈ సాంగ్ మెగా మాస్ సాంగ్ అంటూ దేవి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్ వాయిస్ .. మరింత ఆకర్షిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ వాయిస్ తో పాటు చిరంజీవి మరియు రవితేజ కూడా వాయిస్ ఇస్తూ “పూనకాలు లోడింగ్” అంటూ పాట.. పాడటంతో సరిగ్గా నూతన సంవత్సరానికి ముందు… రిలీజ్ కావటంతో సాంగ్ బాగా వైరల్ అవుతుంది.