Naga Babu new look : టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా కుటుంబానికి ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే ఈ కుటుంబం నుంచి ఎంతో మంది హీరోలు తెలుగు ఇండస్ట్రీలో విజయపథంలో దూసుకుపోతున్నారు. ఇప్పటికే మెగా స్టార్ట్, పవన్ కళ్యాణ్ ఇద్దరు హీరోలుగా మంచి విజయాలను అందుకుంటున్నారు. అదేవిధంగా మెగాస్టార్ తమ్ముడు నాగబాబు పలు సినిమాల్లో నటించినప్పటికీ ఈయనకు అంత క్రేజ్ రాకపోవడంతో నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కానీ ప్రస్తుతం నాగబాబు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు నాగబాబు సినిమా చేయబోతున్నాడ అనే సందేహాలు కలుగుతున్నాయి.
ఎందుకంటే ప్రస్తుతం నాగబాబు ఫోటోని చూస్తే అందరికీ అదే అనిపిస్తుంది. నిన్నటి వరకు ఉన్న నాగబాబు ఈరోజు ఉన్న నాగబాబుకు ఎన్నో తేడాలు ఉన్నాయి. ఇంతటి అవుట్‌లుక్ ఉన్న నాగబాబుకు దర్శక నిర్మాతలు ఎందుకు ఇతన్ని సినిమాల్లో తీసుకోలేదో అర్థం కావడం లేదు.వెండితెరపై ఆఫర్లు రాకపోవడంతో నాగబాబు బుల్లితెరపై పలు కార్యక్రమాలను చేస్తూ ఎప్పటికప్పుడు అభిమానులకు దగ్గరవుతున్నారు.ప్రస్తుతం నాగబాబు షేర్ చేసిన ఈ ఫోటో చూస్తుంటే ఖచ్చితంగా సినిమా చేస్తున్నాడనే అనుమానం కలుగుతోంది.
అడవికి రాజు ఎప్పుడూ సింహమే..
ప్రస్తుతం నాగబాబు పూర్తిగా తన లుక్ ను మార్చి దిగిన ఫోటోను ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ ఫోటోను షేర్ చేస్తూ..”బలం, బలగం, తెలివిగా ఆలోచించడమే రాజును డిసైడ్ చేయదు.. ఆటిట్యూడ్ అనేది కింగ్ ఎవరో డిసైడ్ చేస్తుంది. అందుకే సింహం అడవికి రాజు అయింది”. అంటూ కామెంట్ చేస్తూ భుజంపై సింహం టాటూ ఉన్న ఫోటోను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారి ఎంతోమంది మెగా అభిమానులను ఆకట్టుకుంది. ఈ ఫోటో చూసిన పలువురు నెటిజన్లు నాగబాబు సినిమా కోసమే ఈ విధంగా తన లుక్స్ మార్చినట్లు భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Gruhalakshmi: అవకాశాలు కావాలంటే క్యాస్టింగ్ కౌచ్ కి ఓకే చెప్పాల్సిందే... గృహలక్ష్మి ఫేమ్ తులసి సంచలన వ్యాఖ్యలు..!