వాన ,బంగారం సినిమాల ఫేం మీరా చోప్రా ఇటీవల ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ ఎవరో తనకు తెలియదని పేర్కొనడం ఆ స్టార్ హీరో అభిమానులకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది
ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మీరా చోప్రాను దూషిస్తూ అసభ్యకరమైన మెసేజ్లు పెడుతున్నారు.దీంతో మీరా చోప్రా సామాజిక మాధ్యమాల్లో తనను జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదుచేయడంతో పాటు తెలంగాణ మంత్రి కేటీఆర్కు కూడా ట్వీట్ చేయగా, చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.రాజు తలచుకుంటే దెబ్బలకు కొదవే లేనట్టు పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ఆమెపై పదే పదే వ్యాఖ్యలు చేస్తోన్న 15 మంది ట్విట్టర్ ఖాతాలను పోలీసులు గుర్తించారు.అనంతరం ఆ ఖాతాలను ఉపయోగిస్తున్న వారికి నోటీసులు పంపించారు. వారందరినీ పోలీసులు అరెస్టు చేయనున్నట్లు సమాచారం. మొత్తం మీద చిలికి చిలికి గాలి వాన అన్నట్లు మీరా చోప్రా వ్యాఖ్యలు పెద్ద దుమారం రేపాయి.