సినిమా

Aacharya: చరణ్ చిన్నపుడు ఆ రెండు సినిమాలు చూస్తే గాని భోజనం చేసేవాడు కాదు చిరంజీవి వైరల్ కామెంట్స్..!!

Share

Aacharya: “ఆచార్య” ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో రికార్డు స్థాయిలో రిలీజ్ అయింది. కొరటాల శివ దర్శకత్వంలో చిరంజీవి, చరణ్ కలిసి నటించడంతో ఓపెనింగ్స్ భారీస్థాయిలో రాబట్టినట్లు సమాచారం. గతంలో చిరంజీవి.. చరణ్ సినిమాలలో అడపాదడపా కనిపించిన గాని… “ఆచార్య” లో ఫుల్ లెంగ్త్ రోల్ చేయడంతో ఇద్దరినీ ఒకే ఫ్రేమ్ లో చూడటానికి అభిమానులు.. థియేటర్లకు పోటెత్తుతున్నారు. దాదాపు మూడు సంవత్సరాల తర్వాత చిరంజీవి సినిమా ధియేటర్ లో విడుదల కావడంతో మెగా ఫాన్స్ “ఆచార్య” సినిమా హాల్ వద్ద భారీగా సందడి చేస్తున్నారు.

Acharya: Chiranjeevi, Ram Charan's Bhale Bhale Banjara song out on April 18, don't miss their banter in video | PINKVILLA

పైగా కొరటాల శివ దర్శకుడు కావడంతో.. ఒక్క ఫ్లాప్ కూడా శివకి లేకపోవడంతో… “ఆచార్య” ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో అనేది ఉత్కంఠ భరితంగా నెలకొంది. ఇదిలా ఉంటే ఆచార్య కి భారీ ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు.. ఇంటర్వ్యూ రూపంలో జరగటం మనం అందరం చూశాం. ప్రముఖ యాంకర్లకు ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్లకు అదే విధంగా స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ కి “ఆచార్య” టీం ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో డైరెక్టర్ హరీష్ శంకర్ చేసిన ఇంటర్వ్యూ అన్నిటి మీద హైలెట్ గా నిలిచింది.

Chiranjeevi and Ram Charan's humble gesture for little fan wins hearts. Watch the viral video | Celebrities News – India TV

ఇంటర్వ్యూలో పలు ప్రశ్నలు వేస్తూ చిన్నప్పుడు చరణ్ ఎక్కువ చూసిన సినిమా ఏది అని చిరంజీవిని ప్రశ్నించారు. దానికి చిరంజీవి సమాధానమిస్తూ నేను నటించిన కొండవీటి దొంగ, కొదమ సింహం రెండూ కూడా చూస్తేనే గాని చరణ్ భోజనం చేసేవాడు కాదు. ఆ రెండు సినిమాల క్యాసెట్లు అరిగిపోయాయి. ఎందుకంటే రెండు సినిమాలలో నేను హార్స్ రైడింగ్ చేసేవాడిని చరణ్ కి నచ్చేది. దాంతో ఆ తర్వాత చరణ్ చిన్నప్పుడే గుర్రపుస్వారీ నేర్చుకున్నాడు అంటూ కొత్త విషయాన్ని చిరంజీవి ఆచార్య ప్రమోషన్ కార్యక్రమాల్లో బయట పెట్టడం జరిగింది.


Share

Related posts

Ram – Kruthi: పట్టాలెక్కనున్న రామ్ – కృతి సినిమా..!!

bharani jella

Singer Sunitha : సరిగ్గా 5 నిమిషాల క్రితం ఇన్‌స్టాలో ఆ వీడియో పెట్టిన సునీత .. కోట్లాదిమంది చూస్తున్నారు డోంట్ మిస్ !

Ram

Telugu Movies : రేపు విడుదల కాబోయే సినిమాలు ఇవే..!! విశాల్ × సుమంత్ మధ్య పోటీ..!!?

bharani jella