Movie tickets: ఈ మధ్యకాలంలో కరోనా గడ్డుకాలం తరువాత పెద్ద సినిమాల విషయంలో టికెట్ రేట్ల పెంపు అంశం ఎంతగా హాట్ టాపిక్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ క్రమంలో పెరిగిన RRR టికెట్ రేట్లను చూసి అందరూ షాక్ అయ్యారు కూడా. ఈ క్రమంలో ఆచార్య, సర్కారు వారి పాట సినిమాలకు కూడా టికెట్ రేట్లను పెంచడం మనకు తెలిసినదే. అయితే ఇలా టికెట్ రేట్లు అడ్డగోలుగా పెంచడం పట్ల సాధారణ సినిమా ప్రేక్షకుడు కాస్త అసహనానికి గురి అయినప్పటికీ, అభిమానులు మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఓ పక్క టికెట్ రేట్ల వల్లే థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయనే వాదన కూడా లేకపోలేదు.
మళయాలంలో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ‘జోసెఫ్’ సినిమాకు రీమేక్‌గా రాజశేఖర్ ‘శేఖర్’ అనే చిత్రం రాబోతోంది. దీనికి ‘జీవిత’ రాజశేఖర్ దర్శకత్వం వహించడం విశేషం. అలాగే ఈ సినిమాలో రాజశేఖర్ కూతురు ‘శివానీ’ ఓ ముఖ్యపాత్రలో కనిపించనుందనే విషయం మనకు తెలిసినదే. అయితే ఈ మూవీ మే 20న విడుదల కానుంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్లు ముమ్మురం చేసారు. ఈ సందర్భంగా నిన్న అనగా మే 17న ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో టిక్కెట్ల విషయమై జీవిత రాజశేఖర్ స్పందించింది.
ఈ ఈవెంట్‌లో జీవిత రాజశేఖర్ మాట్లాడుతూ.. “కరోనా తరువాత థియేటర్‌కు జనాలు రావడం తగ్గిపోయింది. సినిమా తీయడం కంటే విడుదల చేయడం ఇప్పుడు కష్టంగా మారింది. అయితే మంచి సినిమాలను మీరెప్పుడూ ప్రేక్షకులు ఆదరిస్తారు. తప్పకుండా మా సినిమాను కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. టికెట్ రేట్లు విపరీతంగా పెంచేయడం వల్ల థియేటర్లకు జనాలు రావడం లేదు. కానీ పెద్ద సినిమాలకు అది తప్పదు. మా సినిమాకు మాత్రం థియేటర్ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం చెప్పిన రేట్లకే అమ్ముతున్నాం. మీకు అందుబాటులోనే ఈ టికెట్ రేట్లుంటాయి. కాబట్టి మా సినిమాకు రండి. మే 20న థియేటర్లో ఈ సినిమాను చూడండి” అని చెప్పుకొచ్చింది.
విభిన్నమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తూ టాలీవుడ్లో తనకంటూ స్పెషల్ ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్.. త్వరలోనే `కార్తికేయ 2`తో పలకరించబోతున్నాడు.…
బీహార్ ముఖ్యమంత్రిగా జేడీయూ నేత నితీష్ కుమార్ 8వ సారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇప్పటి వరకూ నితీష్ కుమార్ ఏడు సార్లు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం…
గత కొద్ది నెలల నుండి సినిమాల ద్వారా వచ్చే ఆదాయం బాగా తగ్గిపోవడం, నిర్మాణ వ్యయం మోయలేని భారంగా మారడంతో.. తెలుగు సినీ నిర్మాతలు తమ సమస్యలను…
జేడీయూ నేత, బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మిత్రపక్షమైన బీజేపీకి మరో సారి షాక్ ఇచ్చారు. ఎన్డీఏ నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించిన నితీష్ కుమార్ ఇప్పటి వరకు…
యంగ్ బ్యూటీ కృతి శెట్టి గురించి పరిచయాలు అవసరం లేదు. తక్కువ సమయంలోనే టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ.. త్వరలోనే `మాచర్ల నియోజవర్గం`తో ప్రేక్షకులను…
సౌత్‌లో లేడీ సూపర్ స్టార్‌గా గుర్తింపు పొందిన నయనతార ఇటీవలె కోలీవుడ్ దర్శక,నిర్మాత విఘ్నేష్ శివన్‌ను పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టింది. దాదాపు ఆరేళ్ల…