RRR: యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తొలిసారి కలిసి నటించిన చిత్రం `ఆర్ఆర్ఆర్(రౌద్రం రణం రుధిరం)`. ఈ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ చిత్రాన్ని దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించగా.. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై డివివి దానయ్య హై బడ్జెట్‌తో నిర్మించారు. ఇందులో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించగా.. రే స్టీవెన్సన్, అలిసన్ డూడీ, అజయ్ దేవ్‌గణ్, శ్రియా సరన్, సముద్రఖని ముఖ్య పాత్రలను పోషించారు.
స్వాతంత్ర్య సమర యోధులు కొమురం భీం, అల్లూరి సీతారామా రాజు జీవితాల ఆధారంగా కల్పిత కథతో రూపుదిద్దుకున్న ఈ చిత్రం అనేక వాయిదాల అనంతరం మార్చి 25న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన అన్ని భాషల్లోనూ సంచలన విజయాన్ని నమోదు చేసి.. భారీ కలెక్షన్స్‌తో ఎన్నో రికార్డులను సృష్టించింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఓటీటీ వేదికగానూ మంచి విజయం సాధించిన ఈ చిత్రం.. ఇండియా వైడ్‌గానే కాదు విదేశాల నుంచి సైతం ప్రశంసలు అందుకుంది. హాలీవుడ్ క్రిటిక్స్ సైతం ఆర్ఆర్ఆర్ ఓ అద్భుతం అంటూ రివ్యూ ఇచ్చారు. కానీ, వెస్ట్రన్ ఆడియన్స్ లో కొందరు ఆర్ఆర్ఆర్ సక్సెస్ చూసి ఓర్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే సినిమాపై చెత్త కామెంట్స్ చేస్తున్నారు.
ఆర్ఆర్ఆర్ ఒక గే మూవీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ లో కొన్ని కొన్ని సన్నివేశాలను చూస్తే గే రొమాన్స్ మూవీలా అనిపిస్తోంది అంటూ వెటకారంగా ట్వీట్స్ చేస్తున్నారు. దీంతో చరణ్, తారక్, రాజమౌళి అభిమానులే కాకుండా భారతీయ సిని ప్రియులు వెస్ట్రన్ ప్రేక్షకులపై మండిపడుతున్నారు. స్నేహం, బ్రోమాన్స్ గురించి తెలియని వెస్ట్రన్ ప్రేక్షకులు ఆర్ఆర్ఆర్ సినిమాను ఎప్పటికీ అర్థం చేసుకోలేరంటూ ధీటుగా సమాధానం ఇస్తున్నారు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!