తాజాగా చిత్ర పరిశ్రకి పెద్ద గుడ్ న్యూస్ వచ్చింది. అదే షూటింగ్స్ కి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలకి అనుమతి. చిత్రం పరిశ్రమలోని మెగాస్టార్ సహా పలువు ప్రముఖులు సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ముఖ్య మంత్రి కెసీఅర్ తో సమావేశమై చర్చలు జరిపిన అనంతరం ముఖ్యమంత్రి ఇప్పటి వరకు షూటింగ్ పూర్తి చేసుకున్న సినిమాలకి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అలాగే అతి కొద్ది యూనిట్ సిబ్బందితో సినిమాలకి షూటింగ్ జరుపుకునేందుకు ఎస్ అంటూ ఫైల్ పై సంతకం పెట్టారు.
ఈ నేథ్యంలో జూన్ 15 నుండి సినిమా షూటింగ్స్…టీవీ షూటింగ్స్ ..ఎడిటింగ్, డబ్బింగ్ ఇతర కార్యక్రమాలు మొదలవుతున్నాయి. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న అతి పెద్ద సమస్య రెడీగా ఉన్న సినిమాల పరిస్థితేంటి అని. షూటింగ్స్ ఒకే అన్న ముఖ్యమంత్రి థియోటర్స్ లో బొమ్మ పడటానికి మాత్రం నో అన్నారు. దాంతో ఎప్పుడు థియోటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితి. మరి రిలీజ్ కి రెడీ గా ఉన్న సినిమాలు ఓటీటీలో రిలీజ్ చేస్తారా అంటే మేకర్స్ నుండి ఎటువంటి సమాధానం రావటం లేదు.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత ఎనర్జిటిక్ హీరో రాం పోతినేని నటించిన మరో మాస్ ఎంటర్టైన్మెంట్ “రెడ్”. తమిళంలో సూపర్ హిట్ అయిన తడం కి అఫీషియల్ గా రీమేక్ చేశారు. కిషోర్ తిరుమల దర్శకత్వం వహించాడు. వాస్తవంగా ఈ సినిమా ఏప్రిల్ లో రిలీజ్ కావాలి. కాని కుదరలేదు. ఇక నేచురల్ స్టార్ నాని నటించిన సినిమా ” వి “. దిల్ రాజు ఈ సినిమాని నిర్మించగా మోహన కృష్ణ ఇంద్రగంటి తెరకెక్కించాడు. సుధీర్ బాబు..నివేదా థామస్..అదితి రావుహైదరి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కూడా ఏప్రిల్ రెండవ వారంలో రిలీజ్ కావాల్సింది.
ఇక కోన ఫిల్మ్ కార్పోరేషన్ లో కోన వెంకట్ నిర్మించిన పాన్ ఇండియా సినిమా “నిశబ్ధం”. అనుష్క మాధవన్ జంటగా నటించిన ఈ సినిమాలో అంజలి, శాలిని పాండే ..ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఏప్రిల్ లోనే రిలీజ్ చేయాలనుకున్నారు. రీసెంట్ గా ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందన్న వార్తలు కూడా వచ్చాయి. కాని ఆ వార్తలను కోన వెంకట్ కొట్టి పారేశాడు. ఎంత లేటయినా మా సినిమాని థియోటర్స్ లోనే రిలీజ్ చేస్తామని తెగేసి చెప్పాడు.
ఈ సినిమాల తో పాటు మాస్ మహారాజ రవితేజ నటించిన “క్రాక్” కూడా రిలీజ్ కి సిద్దంగా ఉంది. పాపం అసలే రవితేజ గత కొంత కాలంగా హిట్స్ లేక మంచి సక్సస్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. చెప్పాలంటే ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు. గోపీచంద్ మలినేని తో హ్యాట్రిక్ హిట్ పడుతుందన్న నమ్మకంతో ఉన్నాడు. కాని ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారో యూనిట్ కి అర్థం కాని పరిస్థితి. ఓటీటీ వైపేమో మొగ్గు చూపడం లేదు ..థియోటర్స్ ఏమో తెరుచుకోవడం లేదు. ఈ సినిమాల రిజల్ట్ మీద ఆశలు పెట్టుకున్న దర్శక, నిర్మాతలు .. హీరో హీరోయిన్స్ పరిస్తితే అంతా అయోమయంగా ఉంది.