Abhijeet : బుల్లితెరపై ప్రసారం అవుతున్న బిగ్ బాస్ రియాలిటీ షో కు ఎంతోమంది అభిమానులు ఉంటారు.బిగ్ బాస్ హౌస్ లో పాల్గొనే కంటెస్టెంట్ లు వారి ఆట తీరును బట్టి హౌస్ లో ఉన్నవారికి ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిపోతూ ఉంటుంది.ఈ నేపథ్యంలోనే బిగ్ బాస్ సీజన్ ఫోర్ కంటెస్టెంట్ గా ఉన్న అభిజిత్ మొదటి రెండు వారాలు ఎంతో సైలెంట్ గా ఉన్నప్పటికీ తర్వాత సైలెంట్ గానే ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారు. హౌస్ లో ఈయనకున్న క్రేజ్ చూసి ఎలాగైనా బిగ్ బాస్ టైటిల్ గెలుచుకుంటాడని ముందుగానే పసిగట్టారు. బిగ్ బాస్ లో ఉన్నప్పుడు అభిజిత్ గురించి బయట ఓ రేంజ్ లో టాక్ వినిపించింది.
అభిజిత్ హౌస్ నుంచి బయటకు రాగానే వరుస సినిమా ఆఫర్లు క్యూ కడతాయనీ బిగ్ బాస్ అభిజిత్ కు ఎంతో పేరు సంపాదించిపెట్టిందని ఎంతోమంది ప్రేక్షకులు భావించారు. కానీ ఇదివరకు బిగ్ బాస్ టైటిల్ గెలుచుకున్న కౌశల్, శివ బాలాజీ వీళ్ళు సంపాదించ లేనంత క్రేజ్ సంపాదించాడు. అయితే గత సీజన్లలో టైటిల్ గెలిచిన విజేతలు బయటకు వచ్చిన తర్వాత వారికి ఎలాంటి ఆఫర్లు లేక సైలెంట్ అయిపోయారు. కానీ అభిజిత్ విషయంలో అలా జరగదు. వరుస అవకాశాలతో బిజీగా ఉంటారని ఎంతో మంది ప్రేక్షకులు, అభిమానులు భావించారు.
అయితే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన అభిజిత్ డబ్బు ఎప్పుడైనా వస్తుంది, పోతుంది. కానీ బిగ్ బాస్ నాకెంతో గుర్తింపును సంపాదించిపెట్టింది అని తెలియజేశారు.అయితే ఈ టైటిల్ గెలుచుకున్న తర్వాత వరుస ఆఫర్లతో ఎంతో బిజీగా ఉంటారని భావించిన అభిజిత్ కూడా గత సీజన్ల విజేతల మాదిరిగానే ఇప్పటివరకు ఎలాంటి ఆఫర్లు రాలేదు. ఇప్పటికీ అభిజిత్ బిగ్ బాస్ వల్ల ఏం లాభం పొందాడనే విషయం ప్రశ్నార్థకంగానే మిగిలిపోయింది.