సినిమా

RRR: రామరాజు డైరీలో భీమ్ గురించి ఏమి రాసుకున్నాడు అంటే..? వైరల్ అవుతున్న ఫోటో..!!

Share

RRR: “ఆర్ఆర్ఆర్” దాదాపు వెయ్యి కోట్లకు పైగానే కలెక్షన్ సాధిస్తూ దూసుకుపోతోంది. KGF 2 రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ కావడంతో కొద్దిగా దెబ్బ వేయడంతో… కలెక్షన్ పరంగా..RRR.. వారం రోజుల నుండి డౌన్ అయింది. అయినా గాని ప్రారంభంలోనే ఓవరాల్ గా భారీగానే లాభాలు తీసుకొచ్చింది. ఇదిలా ఉంటే “RRR”కి సంబంధించిన వీడియో సాంగ్స్ ఒక్కొక్కటే రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇటీవల దోస్తీ సాంగ్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ పాటలో ఒక చోట రామ్ చరణ్ తన డైరీలో ఏదో రాసుకుని అలసట చెంది నిద్ర పోతాడు. అదే సమయంలో తారక్ వస్తాడు. కానీ డైరీలో ఇంగ్లీష్ భాషలో.. చరణ్ రాయటం జరుగుతుంది. ఇదిలా ఉంటే ఆ సాంగ్ లో డైరీలో.. సినిమాలో ఎన్టీఆర్ పక్కనే సహాయ నటుడిగా నటించిన జాతి రత్నాలు ఫేమ్ రాహుల్ రామకృష్ణనీ వెతికిన సందర్భం గురించి చరణ్ రాయటం జరిగింది.

“గోండు జాతికి సంబంధించిన వ్యక్తిని పట్టుకున్నే ప్రక్రియ జరుగుతోంది. లక్ష్యాన్ని ఛేదించడానికి చాలా కష్టపడుతున్న. అనేక ప్రయత్నాలు చేస్తున్నా… ఎక్కడో కొద్దిగా ప్రయాణం అటు ఇటు గా ఉంది. కానీ కచ్చితంగా గోండు జాతి వ్యక్తి ని పట్టుకోవడం జరుగుతుంది. చిన్నపాటి కనెక్షన్ ఎక్కడో మిస్ అవుతుంది. రేపటి నుండి మళ్లీ ఎక్కడనుండి వెతుకులాట మొదలైందో… అదే ప్రాంతాలలో… మళ్లీ వేట స్టార్ట్ చేస్తా.. ఖచ్చితంగా గోండు జాతి వ్యక్తిని పట్టుకున్న అంటూ రామ్ చరణ్ తన డైరీలో రాసుకున్నాడు. సాంగ్లో పుస్తకాల మధ్య చరణ్ పడుకున్న సమయంలో అదే డైరీ తారక్ చూస్తాడు.

కానీ తారక్ కి చదువు రాక పోవడంతో రామరాజు ఏం రాశాడో అనేది తెలియదు. పైగా ఇద్దరి మధ్య స్నేహం ఉండటం తో చరణ్ వెతికేది తనని అని ఎన్టీఆర్ కి తెలియదు… అదేవిధంగా చరణ్ కి కూడా తెలియదు. తాజాగా ఈ విషయం దోస్తీ వీడియో సాంగ్ రిలీజ్ సమయంలో మధ్యలో ఫుటేజీలో బయటపడింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కొమరం భీమ్, రామరాజు పాత్రలో చరణ్, ఎన్టీఆర్.. నటనకు బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు మాత్రమే కాదు మిగతా ప్రపంచ దేశాల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి ఒకో వీడియో సాంగ్ రిలీజ్ అవుతూ ఉండగా.. మరికొద్ది రోజుల్లో పూర్తి సినిమా ఓటిటి లోకి రాబోతున్నట్లు సమాచారం. 


Share

Related posts

Pawan Kalyan : పవన్ కు అన్నీ ఏప్రిల్ నెలలోనే..! డిజాస్టర్లు.. భారీ బ్లాక్ బస్టర్లు..!

Muraliak

Nivetha Thomas Latest Pics

Gallery Desk

చైనాలో `2.0` రికార్డ్ చేయనుందా?

Siva Prasad