Sai Pallavi: సాయి పల్లవి.. ఈ బ్యూటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. `ఫిదా` మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈమె.. ఫస్ట్ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్‌ను ఖాతాలో వేసుకుని తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. ఆ తర్వాత పాత్రకు ప్రాధన్యత ఉన్న సినిమాలు చేసి స్టార్ హోదాను దక్కించుకున్న సాయి పల్లవి.. చివరిగా `లవ్ స్టోరీ`, `శ్యామ్ సింగరాయ్` చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది.
ఈ రెండు చిత్రాలు ఘన విజయం సాధించాయి. లవ్‌స్టోరీలో మౌనికగా, శ్యామ్ సింగరాయ్‌లో దేవదాసీ మైత్రిగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఏమైందో ఏమో కానీ.. శ్యామ్ సింగరాయ్ తర్వాత సాయి పల్లవి నుంచి మరో కొత్త సినిమా అనౌన్స్మెంట్ రాలేదు. దీంతో ఇప్పుడీ విషయం నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది.
అసలు సాయి పల్లవికి ఆఫర్లు రావడం లేదా..? లేక వచ్చిన ఆఫర్లనే ఆమె వదులుకుందా..? అన్న ప్రశ్నలు అందరిలోనూ మొదలయ్యాయి. మరోవైపు సాయి పల్లవి కావాలనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకుంటుందనే వాదన సైతం వినిపిస్తోంది. ఏదేమైనా తమ అభిమాన హీరోయిన్ నుంచి కొత్త సినిమా అప్డేట్స్ రాకపోవడంతో ఫ్యాన్స్ తీవ్ర ఆందోలన చెందుతున్నారు.
కాగా, సాయి పల్లవి చేతిలో ప్రస్తుతం `విరాటపర్వం` సినిమా మాత్రమే ఉంది. రానా దగ్గుబాటి హీరోగా వేణు ఊడుగల దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రాన్ని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై దగ్గుబాటి సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి నిర్మించారు. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తైనా.. విడుదలకు మాత్రం నోచుకోవడం లేదు.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!