స్టార్ రైటర్ కాకముందు ఆమె ఏమిటి ? ఆశ్చర్యం గొలిపే నిజాలు !!

Share

సెక్స్ వర్కర్ నుంచి ఒక స్టార్ రైటర్ గా మారిన ఆమె జీవితంలో ఎన్నో చెరగని చేదు అనుభవాలు ఉన్నాయి. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా తెలియదు అంటేఆమె ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొని పైకొచ్చిందో అర్థం చేసుకోవచ్చు ఆ రైటర్ మరెవరో కాదు.

 

 

బాలీవుడ్ లో ఆషికి 2 వంటి ఎమోషనల్ లవ్ స్టోరిలకు రైటర్ గా వర్క్ చేసిన షాగుప్తా రఫీక్. తెలుగు వారికి ఆమె పెద్దగా పరిచయం లేకపోవచ్చు గాని బాలీవుడ్ జనాలకు మాత్రం బాగా తెలుసు. అయితే షాగుప్తా రైటర్ గా జీవితాన్ని స్టార్ చేయడానికి ముందు ఎవరు ఊహించని కఠినతరమైన జీవితాన్ని ఎదుర్కొంది. ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి వివరణ ఇచ్చింది.


ఆమె జీవితం ఒక సెక్స్ వర్కర్ నుంచి ఉహీంచని మలుపులు తిరిగింది. కనీసం తన తల్లిదండ్రులు ఎవరో కూడా షాగుప్తాకి తెలియదు అంటే ఆమె ఎలాంటి పరిస్థితులను దాటుకుంటూ వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.షాగుప్తా ఒంటరిగా ఉండడంతో ఒక మహిళ ఆమెను చేరదీసింది. కొన్నాళ్లకు ఆ మహిళ మరో వ్యక్తికి దగ్గరవ్వగా అతను కొన్నిరోజులకే మరణించడంతో వారి జీవితం మరింత అంధకారంలోకి వెళ్లింది. దీంతో టీనేజ్ వయసులోనే కుటుంబ బాధ్యతలు తీసుకున్న షాగుప్తా.. ఒక బార్ డ్యాన్సర్ గా కూడా వర్క్ చేసింది.అనంతరం కొన్నాళ్లకు బార్ డ్యాన్సర్ నుంచి డబ్బుల కోసం సెక్స్ వర్కర్ గా మారే పరిస్థితి ఏర్పడింది. ఆకలి కోసం ఆమె ఒళ్ళు అమ్ముకోక తప్పలేదు. డ్యాన్స్ చేస్తుంటే తనపై అసభ్యకరంగా డబ్బులు చల్లారని చెప్పిన షాగుప్తా ఒక మహిళను ఈ సమాజంలో ఎలా చూస్తారో అప్పుడే అర్ధమయ్యిందని డైరెక్ట్ గా చెప్పేసింది.

కొన్నాళ్లకు జీవితంలో నాకు నచ్చిన పని చేయాలని అనుకున్నాను అంటూ రైటర్ గా మారినట్లు తెలిపింది.ఎలాగైనా రైటర్ కావాలని దృఢంగా నిశ్చయించుకున్నాను. సీనియర్ నిర్మాత, దర్శకుడు మహేష్ భట్ ని కలిసి తన రైటింగ్ స్కిల్స్ ని చూపించగా వెంటనే ఆయన నాకు సపోర్ట్ చేశారని తెలిపింది. 2006లో వచ్చిన వా..లంహే సినిమా ద్వారా స్క్రీన్ ప్లే రైటర్ గా డైలాగ్స్ రైటర్ గా కెరీర్ ని స్టార్ట్ చేసిన షాగుప్తా ఇక వెనుతిరిగి చూడలేదు ఆ తరువాత మర్డర్ 2, జన్నథ్ 2 వంటి సినిమాలతో తన క్రేజ్ ని మరింత పెంచుకుంది.

బాలీవుడ్ లో అతి తక్కువ బడ్జెట్ లో వచ్చి 200కోట్లకు పైగా బాక్సాఫీస్ కలెక్షన్స్ అందుకున్న ఆషికీ 2 సినిమాకు కథ, మాటలు అందించిన షాగుప్తా చూస్తుండగానే బాలీవుడ్ స్టార్ రైటర్స్ లో ఒకరిగా మారిపోయింది.అమె గురించి ఇంత చదివాక తెలుసుకున్నాక షా గుప్త ఒక ప్రేరణ శక్తి అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు .

Share

Related posts

Chandra Babu : చంద్రబాబుకు వైసీపీ షాక్ లు..! మామూలుగా ఇవ్వడం లేదుగా..!!

somaraju sharma

న‌య‌న‌తార ప్రియుడిపై నిర్మాత‌ల కేసు…

Siva Prasad

Anjali Cute Looks

Gallery Desk