అహో ఒక మనసుకు నేడే పుట్టిన రోజు.. అహో తన పల్లవి పడే చల్లని రోజు… ఏంటి ఈ పాట ఇంకా గుర్తుకు రాలేదా ?? అదేనండి రాజశేఖర్, రమ్యకృష్ణ జంటగా నటించిన అల్లరి ప్రియుడులోని పాటండి. ఈ సినిమాతో రాజశేఖర్ సినీప్రస్థానం మరో మెట్టు ఎక్కిందని చెప్పొచ్చు. ఈ ఒక్క అవకాశంతో రాజశేఖర్ పోలీస్ పాత్రలే కాకుండా ప్రేమకథా చిత్రాలతో ప్రేక్షకులను అలరిస్తానని తన నటనతో నిరూపించారు.
ఎక్కువగా పోలీస్ పాత్రలు చేసి అభిమానుల హృదయాల్లో తనదైన ముద్ర వేశారు హీరో రాజశేఖర్. వరుసగా సక్సెస్ లేకపోయినా ప్రతిసారి బ్లాక్ బస్టర్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుంటారు. తన ఖాతాలో ఎన్నో మంచి చిత్రాలు ఉన్నప్పటికీ అల్లరి ప్రియుడు ఒక ప్రత్యేకం స్థానం సంపాదించుకుంది.
1993లో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం యువతను, మహిళలను రాజశేఖర్ కు మరింత చేరువ చేసింది. ప్రతి పాటకు ఎం.ఎం. కీరవాణి సంగీత దర్శకుడిగా ప్రాణం పోశారు. పాటలు సినిమాకు మంచి పేరుతో పాటు.. ప్రేక్షకుల మనసుని తట్టి లెపాయి. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద భారీగానే వసూలు చేసింది. అప్పట్లో సంచలనం సృష్టించిన ఈ చిత్రానికి నెగిటివ్ కామెంట్స్ కూడా వచ్చాయి.
అయితే రాజశేఖర్ పాత్రకు మొదట హీరో సుమన్ ను అనుకున్నారట కె. రాఘవేంద్రరావు. అప్పట్లో సుమన్ తన నటన, యాక్షన్ తో మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల సుమన్ ఈ ప్రాజెక్టుకి దూరం అయ్యారు. సుమన్ దూరం అవ్వటంతో… ఆ అవకాశాన్ని రాజశేఖర్ ని వెతుకుంటూ వచ్చింది. ప్రస్తుతం కరోనా నుంచి కొలుకున్న రాజశేఖర్ పెడింగ్‌లో ఉన్న సినిమాలకు చేయడానికి ఆయన రెడీ అవుతున్నారు.