Kushi: శివానిర్వాన దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సమంత హీరోయిన్ గా నటించిన సినిమా “ఖుషి” నేడు విడుదలయ్యింది. ప్రేమ కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజు పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. సింపుల్ ప్రేమ కథతో అద్భుతమైన ఎమోషనల్ సన్నివేశాలతో దర్శకుడు సినిమాని నడిపించిన తీరు ఎంతగానో ఆకట్టుకుంది. ఫస్టాఫ్ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు ఎమోషనల్ రొమాంటిక్ సన్నివేశాలు ఆకట్టుకోక సెకండ్ హాఫ్ లో కొంతమంది అనవసరమైన సన్నివేశాలు ఉండటం కొద్దిగా బోరింగ్ అనిపించింది. ఇక క్లైమాక్స్ బాగా ఆకట్టుకోవడంతో.. సినిమా చూసిన ప్రేక్షకులు.. పాజిటివ్ గానే ఫీల్ అవుతున్నారు.

ఇదిలా ఉంటే “ఖుషి” సినిమా హిట్ అయింది కదా అని నాగచైతన్య నీ ఇటీవల మీడియా ప్రశ్నించడం జరిగిందట. ఈ క్రమంలో తాను ఆ సినిమా చూడలేదని సమాధానం ఇవ్వడం జరిగిందట. కానీ “ఖుషి” డైరెక్టర్ శివ నిర్వాణ.. తనకి ఇష్టమైన దర్శకుడు అని ఈ క్రమంలో సినిమా మరింతగా విజయం సాధించాలని సమంతా తో పాటు విజయ్ కి నాగచైతన్య బెస్ట్ విషెస్ చెప్పినట్లు టాక్. గతంలో శివానిర్వాన దర్శకత్వంలో నాగచైతన్య “మజిలీ” అనే సినిమా చేయడం జరిగింది. ఈ సినిమాలో సమంత హీరోయిన్. సమంతాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత.. చేసిన సినిమా. “మజిలీ” సినిమా నాగచైతన్య కెరియర్ లో సూపర్ హిట్ అయింది. ఈ క్రమంలో “ఖుషి” సినిమా మరింతగా విజయం సాధించాలని నాగచైతన్య కోరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.

వరుస పరాజయాలు మీద ఉన్న విజయ్ దేవరకొండ “ఖుషి” సినిమా విజయం సాధించటంతో కొద్దిగా రిలీఫ్ కావడం జరిగింది అంట. దాదాపు రెండు మూడు సంవత్సరాలు నుండి విజయ్ దేవరకొండ కి సరైన హిట్టు లేదు. గత ఏడాది వచ్చిన “లైగర్” దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఇటువంటి పరిస్థితులలో తనకి కలిసి వచ్చిన రొమాంటిక్ జోనర్ ఎంచుకొని చేసిన “ఖుషి” నేడు విడుదలయ్యి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంది.