ప్రభాస్ గురించి ఇలాంటి పుకార్లు పుట్టిస్తుంది ఎవరు..? బుద్ధుందా అసలు..??

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో “రాదే శ్యాం” అనే సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇందులో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. పాతకాలంనాటి పిరియాడికల్ లవ్ స్టోరీ తరహాలో ఈ సినిమా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజా హెగ్డే మ్యూజిక్ టీచర్ క్యారెక్టర్ చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే తాజాగా పూజ క్యారెక్టర్ సంబంధించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వినబడుతున్న వార్త ప్రకారం ఈ సినిమాలో పూజా హెగ్డే డబల్ రోల్ లో నటిస్తున్నట్లు ఆ వార్త సారాంశం.

Prabhas 20 titled 'Radhe Shyam', first look with Pooja outదీంతో ఈ వార్త  వినే సోషల్ మీడియాలో నెటిజన్లు సాధారణంగా డబుల్ క్యారెక్టర్ రోల్స్ హీరోలకు వస్తాయి కానీ హీరోయిన్ కి రావడం ఇదే ప్రథమం పైగా టాప్ హీరోయిన్ పూజ హెగ్డే కి అంటూ యాటకరంగా స్పందిస్తున్నారు. అయితే ఈ ఇద్దరు కవలలు ఒకరికి తెలియకుండా మరొకరు ప్రభాస్ నీ ప్రేమిస్తారని చివరికి ఒకరు త్యాగం చేస్తారని ఒక వార్త సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది. ఇదంతా పుకార్లు అని అసలు ఈ వార్తల్లో నిజం లేదని ప్రభాస్ అభిమానులు కొట్టిపారేస్తున్నారు.

 

కావాలని ప్రభాస్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి యాంటీ ఫ్యాన్స్ ఆడుతున్న డ్రామాలు అని మరి కొంతమంది సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఇదిలా ఉండగా ఈ చిత్రానికి సంబంధించి షూటింగ్ మళ్లీ పునఃప్రారంభించడానికి సినిమా యూనిట్ మొత్తం ఇటలీ బయలుదేరినట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి.