NewsOrbit
Entertainment News సినిమా

SSMB29: రాజమౌళి మహేష్ బాబు సినిమాలో హీరోయిన్ ఎవరంటే..?

Share

SSMB29: ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. “RRR” వంటి భారీ బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత జక్కన్న దర్శకత్వంలో తెరకెక్కబోయే సినిమా ఇదే. “SSMB29” వర్కింగ్ టైటిల్ పేరిట ఈ సినిమాకి సంబంధించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. యాక్షన్ అడ్వెంచర్ డ్రామాగా ఈ సినిమా స్టోరీ ఉండబోతున్నట్లు ఫస్ట్ నుండి ప్రచారం జరుగుతోంది. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా మొదటి చేయాలనుకున్న ఇప్పుడు “RRR” తో వచ్చిన క్రేజ్ కారణంగా పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కించబోతున్నట్లు సమాచారం. అంతేకాదు ఈ సినిమా నిర్మాణ భాగస్వామ్యంలో హాలీవుడ్ నిర్మాణ సంస్థలు కూడా ఉత్సాహంగా ఉన్నట్లు దీంతో స్క్రిప్ట్ లో మార్పులు చేర్పులు చేసి ప్రపంచ స్థాయిలో భారీ విజువల్ యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా రూపొందించడానికి జక్కన్న అనుకుంటున్నట్లు టాక్.

Who is the heroine in Rajamouli's Mahesh Babu movie

దీనిలో భాగంగా ప్రత్యేకంగా ఈ సినిమాకి సంబంధించి విఎఫ్ఎక్స్ వర్కులు గ్రాఫిక్స్.. బాధ్యత ఓ విదేశీ సంస్థకి అప్పగించబోతున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఈ సినిమాకి సంబంధించి హీరోయిన్స్ విషయంలో రకరకాల వార్తలొస్తున్నాయి. మొదట బాలీవుడ్ హీరోయిన్ దీపికా పదుకొనే పేరు వినపడింది. ఆ తర్వాత హాలీవుడ్ హీరోయిన్ జెన్న ఓర్టే నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే లేటెస్ట్ గా జాహ్నవి కపూర్ నీ జక్కన్న కన్ఫామ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబుకి ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి. పైగా హీరోయిన్ శ్రీదేవికి తెలుగులో మంచి క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే.

Who is the heroine in Rajamouli's Mahesh Babu movie

ఆమె మరణించిన సమయంలో తెలుగు ప్రేక్షకులు ఎంతగానో బాధపడ్డారు. శ్రీదేవి వారసురాలిగా జాహ్నవి కపూర్ హిందీలో సత్తా చాటడం జరిగింది. సౌత్ లో ఫస్ట్ టైం ఎన్టీఆర్ కొరటాల సినిమాతో ప్రేక్షకులను పలకరించనుంది. ఇక రెండో సినిమాగా మహేష్ బాబుతో జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.ప్రజెంట్ మహేష్ బాబు… త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు నువ్వు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. వచ్చే ఏడాది సినిమా రిలీజ్ కానుంది. ఈ సినిమా కంప్లీట్ అయిన వెంటనే రాజమౌళి దర్శకత్వంలో మహేష్ సినిమా స్టార్ట్ కానున్నట్లు సమాచారం.


Share

Related posts

Nidhhi Agerwal New HD Stills

Gallery Desk

Meera Jasmine: లోదుస్తుల‌ను చూపిస్తూ మీరా జాస్మిన్ హాట్ ఫోజులు.. పిక్స్ చూస్తే మ‌తిపోద్ది!

kavya N

Mahesh Nani: మహేష్ -త్రివిక్రమ్ సినిమాలో తాను ఉన్నట్లు వచ్చిన వార్తల పై రియాక్ట్ అయిన నాని..!!

sekhar