తెలుగమ్మాయిలు హీరోయిన్స్ గా తెలుగు తెరకి పరిచయం అవడమే తక్కువ. అయినా వాళ్ళు త్వరగా మరుగున పడిపోతున్నారు. అందుకు కారణం ముంబై హీరోయిన్స్ తో పోల్చుకుంటే మన తెలుగమ్మాయిలకి కొన్ని హద్దులుంటాయి. అవి దాట లేక ఎంత టాలెంట్ ఉన్నా పక్కన పెడతారు. ఈ విషయంలో చాలామంది తెలుగమ్మాయిలు వాపోతున్నారు. అందుకు ఉదాహరణ తేజస్వి మదివాడ..అంతకముందు మాధవీ లత.
చెప్పాలంటే ఈ ఇద్దరు తెలుగమ్మాయిలైనప్పటికి సినిమాకి ఏలా కావాలో ఆ సినిమాలో క్యారెక్టర్ ఏం డిమాండ్ చేసిందో అవి చేయడానికి వెనకాడ లేదు. గ్లామర్, ఎక్స్‌ఫోజింగ్ …అన్నిటికి రెడీగా ఉన్నారు. ఈ విషయం మాధవీలత ఓపెన్ గానే వెల్లడించింది. ఇక తేజస్వి మదివాడ రాం గోపాల్ వర్మ ఐస్ క్రీం సినిమాలో చేసిన క్యారెక్టర్ చూస్తే మన వాళ్ళు కూడా క్యారెక్టర్ డిమాండ్ చేస్తే ముంబై వాళ్ళ కంటే తక్కువేం కాదని అర్థం అవుతుంది.
అయినా ఇంకా ఏదో కావాలి. అక్కడే తెలుగమ్మాయిలని తీసి పక్కన పెడుతున్నారు. రీసెంట్ గా తేజస్వి మదివాడ కమిట్మెంట్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. దర్శకుడు లక్ష్మీకాంత్ చెన్నా తో కలిసి ఈ తెలుగమ్మాయి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ సందర్భంగా పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. తను హీరోయిన్ గా ఎదగకపోవడానికి కారణం కాస్టింగ్ కౌచ్ అంటూ ఇండస్ట్రీలో ఎక్కువశాతం మంది ఇది అడుగుతారని బాంబ్ షాకిచ్చింది.
సినిమా పరంగా ఎంత కావాలో అంత చేయడనికి మేము ఒప్పుకుంటున్నాము..అందుకు ఉదాహరణ మేము చేసిన సినిమాలే. అయినా మేము హీరోయిన్స్ గా పనికి రావడం లేదు. ఎందుకంటే ముంబై మోడల్స్ లాగా మేము వాళ్ళకి కావాల్సినట్టు ఉండము. తెలుగమ్మాయిలు అందంగా ఉండరా..గ్లామర్ రోల్స్ చేయరా ..నేను గ్లామర్ రోల్స్ చేయలేదా ..ఎవరు చెప్పారు. వాళ్ళు మాలాంటి వాళ్ళకి అవకాశాలు ఇవ్వరంతే ..అంటూ ఈ తెలుగమ్మాయి ఇన్నాళ్ళు మనసులో దాగిఉన్న విషయాలని బయట పెట్టింది.
Anchor Srimukhi: రేటింగ్ కోసం ఏకంగా అంతకి దిగజారిన శ్రీముఖి.. ఘోరమైన ట్రోల్స్..!