Samantha: హీరోయిన్ సమంత హఠాత్తుగా అమెరికా నుండి హైదరాబాద్ కి వచ్చేయడం జరిగిందట. ఆమె నటించిన ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో కూడా పెద్దగా పాల్గొనలేదు. ఈ క్రమంలో సమంత దాదాపు ఏడాది పాటు అమెరికాలోనే ఉండబోతున్నట్లు కొద్దిరోజుల క్రితం వార్తలు వైరల్ అయ్యాయి. ఆమె ఆరోగ్యం నిమిత్తం అక్కడే ట్రీట్మెంట్ తీసుకోబోతున్నట్లు.. మునుపటి ఛాయ వచ్చే రీతిలో.. కొంతకాలం అమెరికాలో ఉండాలని సమంత డిసైడ్ అయినట్లు ప్రచారం జరిగింది. అందువల్లే ఖుషి తర్వాత ఆమె ఎలాంటి సినిమా ఒప్పుకోలేదని అన్నారు. ఇటువంటి నిర్ణయం తీసుకుని అమెరికా వెళ్లిన సమంత ఇప్పుడు ఉన్నటువంటి హఠాత్తుగా హైదరాబాద్ వచ్చేయడం జరిగింది అంట.
విషయంలోకి వెళ్తే ఖుషి సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో ఎక్కడా కూడా ఇండియాలో సమంత కనిపించలేదు. ఆడియో కన్సర్ట్ కార్యక్రమం అనంతరం ఆమె.. అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత సినిమా విడుదలవడం పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవటం అంతా తెలిసిందే. హిట్ టాక్ సంపాదించుకున్న మూడు రోజులకే 70 కోట్ల మేర గ్రాస్ సంపాదించడం జరిగింది. అయితే ఖుషి సినిమా విడుదలైన తర్వాత వారమే ఇప్పుడు జవాన్, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి రెండు సినిమాలు విడుదలయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడంతో ఒక్కసారిగా ఖుషి కలెక్షన్స్… తగ్గటంతో నిర్మాతలు అలెర్ట్ కావడం జరిగింది అంట.
దీంతో ఇప్పుడు ప్రమోషన్ కార్యక్రమాలు భారీ ఎత్తున చేయాలని డిసైడ్ అయ్యారట. ఈ వారంలో కొద్దిగా ఇంటర్వ్యూలు పలు కార్యక్రమాలు నిర్వహించాలని ప్లాన్ చేసి విజయ్ దేవరకొండతో మాట్లాడి.. హీరోయిన్ సమంతని కూడా ఇండియాకి రప్పించడం జరిగిందంట. ఇదే సమయంలో ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశాఖపట్నంలో.. సక్సెస్ మీట్ నిర్వహించిన సినిమా యూనిట్… హైదరాబాదులో కూడా నిర్వహించాలని అనుకుంటున్నారట. ఇందుకోసం సమంతని అమెరికా నుండి హైదరాబాద్ కి పిలిపించినట్లు వార్తలు వస్తున్నాయి. హైదరాబాద్ సక్సెస్ మీట్ కార్యక్రమం తో పాటు కొన్ని ఇంటర్వ్యూలు.. సమంతతో “ఖుషి” నిర్మాతలు ప్లాన్ చేయటం జరిగిందట.