Unstoppable Show: నటసింహం నందమూరి బాలకృష్ణ తొలిసారి హోస్ట్‌గా చేస్తున్న షో `అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే`. నవంబర్ 4న ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహాలో ప్రారంభమైన ఈ షో దిగ్విజయంగా ముందుకు సాగుతోంది. బాలయ్య తనదైన హోస్టింగ్‌తో ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ షోలో మోహన్ బాబు, నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ తదితరులు పాల్గొని బాలయ్యతో నానా హంగామా చేశారు.
ఇక త్వరలోనే ఫస్ట్ సీజన్ కూడా పూర్తి కాబోతోంది. అయితే టాలీవుడ్ ప్రముఖులెందరో వచ్చారు. కానీ, బాబాయ్ షోకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాత్రం రాలేదు. దీంతో అన్ స్టాపబుల్ షోకు ఎన్టీఆర్ రాకపోవడం వెనకున్న టాప్ సీక్రెట్ ఏంటా అని నందమూరి అభిమానులు ఆరా తీయగా.. అసలు విషయం బయటకు వచ్చింది.
బాలయ్య షోకు ఆహా టీమ్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లను కలిపి ఆహ్వానించాలనుకున్నారట. అయితే వారిని సంప్రదించేలోపే ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ కోసం వాళ్లిద్దరూ ముంబై వెళ్లిపోయారట. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో బిజీగా ఉండటం వల్లే ఎన్టీఆర్ అన్ స్టాపబుల్‌కి రాలేకపోయాడని.. కానీ, సీజన్ 2లో మాత్రం ఖచ్చితంగా బాబాయ్‌తో అబ్బాయి సందడి చేస్తాడని అంటున్నారు.
కాగా, ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే.. ఈయన నటించిన `ఆర్ఆర్ఆర్` చిత్రం ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుంది. కానీ, విడుదలకు మాత్రం నోచుకోలేకపోతోంది. ఇక ఈ సినిమా తర్వాత తారక్ కొరటాల శివతో ఓ సినిమా, ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయనున్నాడు. ఈ ప్రాజెక్ట్స్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన కూడా వచ్చింది.