Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కెరీర్ పరంగా తోటి హీరోలతో పోలిస్తే తక్కువ సినిమాలు తీసిన టాలీవుడ్ బాక్సాఫీస్ ని శాసించే రీతిలో అనేక రికార్డులను సృష్టించే విధంగా పవన్ కళ్యాణ్ తన సినిమాలతో సత్తా చాటాడు. అయితే పవన్ తన కెరియర్ లో కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాలు వదులుకోవటం తెలిసిందే. ముఖ్యంగా డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అనేక సినిమాలను పవన్ వదులుకున్నారు.
వాటిలో ఒకటి రవితేజ నటించిన “ఇడియట్”. పూరి ఈ సినిమా స్టోరీని మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ కి వినిపించడం జరిగింది. కానీ పవన్ రిజెక్ట్ చేయడం జరిగింది. సినిమా పవన్ కళ్యాణ్ ఒప్పుకోకపోవడం కి గల కారణం సినిమాలో ఎక్కువగా .. హీరో ఆడవాళ్లలో ఏడిపించే సన్నివేశాలు ఉండటంతో .. అటువంటి పాత్రలు చేయడం వల్ల సమాజంలో వేరే మెసేజ్ వెళుతుందని.. అందువల్ల “ఇడియట్” సినిమా చేయకుండా .. పవన్ ఆగిపోవడం జరిగిందట.
Read More: Pawan Kalyan: ఇండస్ట్రీలో ఏ నిర్మాతకి ఇవ్వని అవకాశం బండ్లగణేష్ కి ఇచ్చిన పవన్..??
పూరి జగన్నాథ్ దర్శకత్వంలో “ఇడియట్” మాత్రమే కాకుండా “పోకిరి”.. ఇంకా చాలా సినిమాలు పవన్ రిజెక్ట్ చేయడం జరిగింది. చాలావరకు బ్లాక్ బస్టర్ సినిమాలు వదిలేసుకున్నారు. ఇడియట్ సినిమా కూడా అప్పట్లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. అయినా కాని ఆడవాళ్ళు విషయంలో సమాజంలో చెడ్డ మెసేజ్ వెళుతుందని పవన్ ఈ సినిమా ఒప్పుకోకుండా పక్కన పెట్టడం జరిగిందట. తాజాగా ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.