Alia bhatt: బాలీవుడ్ క్రేజీ స్టార్ అలియాభట్ ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ మూవీ ‘గంగూబాయి కతియావాడి’. భారీ స్థాయిలో ఈ సినిమా ఇదే నెల 25న రిలీజ్ అవుతోంది. సౌత్ స్టార్ హీరోలు నటించిన భీమ్లా నాయక్, వలిమై సినిమాలతో ఆలియా గంగూబాయి సినిమా పోటీ పడుతోంది. దాంతో అందరిలోనూ విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఇక ఈ సినిమా రిలీజ్ సమయం దగ్గర పడింది. ఇదే సమయంలో ‘గంగూబాయి కతియావాడి’ సినిమాపై కమాతీపుర నివాసితులు అలాగ్ర, ముంబై లో నెలొకన్న వివిధ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ సినిమాలో ట్రైలర్ తోనే కమాతీపుర ప్రతిష్టని దిగజార్చారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా పలు వాయిదాల తర్వాత ఎట్టకేలకు ఇప్పుడు వస్తోంది.
కమాతీపురము ఘోరమైన రెడ్ లైట్ ఏరియాగా మార్చి గంగూబాయి సినిమా తీసారంటూ కమాతీపుర నివాసితులు ఫైరవుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ వివాదానికి సంబంధించి కమాతీపుర వాసులు ముంబై హైకోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేశారు. ఇక ఇటీవల రిలీజ్ అయిన సినిమా ట్రైలర్ తర్వాత ఈ ప్రాంతం ప్రతిష్ట ఎంతగానో దెబ్బతింది. ఈ ప్రాంతాన్ని రెడ్ లైట్ ఏరియాగా చూస్తున్నారని పిటీషన్లోనూ పేర్కొన్నారు. కమాతీపురలో 55 మంది నివాసితుల తరుపున ఓ మహిళ ఈ పిటీషన్ దాఖలు చేయడం గమనర్హం. దాంతో పాటు ఇంకా చాలామంది ఈ మూవీ మీద పలు కేసులను పెట్టి కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. రిలీజ్ ఆపాలని వారు కోరుతున్నారు.
Alia bhatt: గంగూబాయి ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద..?
దీనిపై బుధవారం విచారణకు రానుంది. మరోవైపు బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ ..గంగూబాయి రిలీజ్ రోజు రూ 200 కోట్లు లాస్ అవబోతున్నాయని కామెంట్స్ చేశారు. ఆమెకు అసలు యాక్టింగ్ రాదు. అలాంటి ఆలియాతో ఇలాంటి సినిమా అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇవన్నీ గంగూబాయి సినిమా మీద నెగిటివ్ ప్రభావం చూపుస్తున్నాయి. ఇప్పుడు ఇదే సినిమాతో పాటు ఆలియా మీద వెల్లువెత్తుతున్న విమర్శల ప్రభావం రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మీద పడే అవకాశాలున్నాయని ప్రచారం మొదలైంది. ఇంతక ముందు కూడా ఆమెకిచ్చిన రెమ్యునరేషన్ విషయంలో నెటిజన్స్ ట్రోల్స్ చేశారు. ఇప్పుడు గంగూబాయి ఎఫెక్ట్ ఆర్ఆర్ఆర్ సినిమా మీద గట్టిగానే పడుతుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎం జరుగుతుందో.