Anchor suma: యాంకర్ సుమ అంటే తెలియని తెలుగువారు ఉండరంటే అతిశయోక్తికాదు. బేసిగ్గా తెలుగు యాంకర్ అయినటువంటి ఈమె కేరళకు చెందిన వ్యక్తి అని చాలా కొద్దిమందికి తెలుసు. అంతగా ఆమె తెలుగు వారి హృదయాలలో స్థానం సంపాదించుకుంది. తెలుగు భాష ఈమె మాతృ కానప్పటికీ, తెలుగులో అనర్గళంగా మాట్లాడగలగడం ఆమె ప్రత్యేకత. ఆమె తెలుగు భాషను చక్కగా మాట్లాడడమే కాకుండా, వ్యాఖ్యానం (యాంకరింగ్) చేస్తూ సదరు రంగంలో తారాస్థాయికి చేరుకుంది. చక్కటి చిరునవ్వు, సమయస్ఫూర్తితో కూడిన వ్యాఖ్యానం ఆమె సొంతం.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
Anchor suma: యాంకరింగ్ ఫీల్డ్ ని వదిలేస్తుందా?
ఇకపోతే, చాలా కాలంగా బుల్లితెరపై యాంకర్‌గా దుమ్ముదులుపుతున్న సుమ, తాజాగా ‘జయమ్మ పంచాయితీ’ సినిమాతో వెండితెరపై ఎంట్రీ ఇచ్చింది. విజయ్ కలివారపు దర్శకత్వం వహించిన ఈ సినిమా ఈరోజు అనగా శుక్రవారం 06-05-2022 నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి వసూళ్లను రాబడుతోంది. ఇక తాజాగా ఓ మీడియా వేదికగా అడిగిన ఓ ప్రశ్నకు ఇప్పటి నుంచి సినిమాల్లోనూ కూడా నటిస్తానని సుమ స్వయంగా చెప్పడం ఇపుడు పలు అనుమానాలకు దారి తీస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram . Follow us on Googlenews
సుమ ఆన్సర్ ఇదే!
దాంతో సుమ యాంకరింగ్ పైన పలు అనుమానాలు చేస్తున్నారు కొందరు. ఈ క్రమంలో కొన్ని మీడియా సంస్థలు అయితే సుమ యాంకరింగ్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది అని స్టోరీస్ కూడా చేసేస్తున్నారు. ఈ నేపథ్యంలో, తాజాగా ఈ విషయంపై సుమ స్పందించింది. ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సదరు జర్నలిస్ట్ ఈ ప్రశ్న వేయగా సుమ మాట్లాడుతూ.. బుల్లితెరను వదిలే ఛాన్సే లేదని తేల్చి చెప్పింది. తనకు అన్నం పెట్టిన బుల్లితెర తల్లితో సమానమని, కన్నతల్లిని వదిలే ప్రసక్తే లేదని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సినిమాలతో పాటు బుల్లితెరపై కంటిన్యూ అవుతానని చెప్పడం గమనార్హం.