న్యూస్ సినిమా

KGF 2 – Acharya: కేజీఎఫ్ 2 ఎఫెక్ట్ ఆచార్య పై గట్టిగానే పడుతుందా..?

Share

KGF 2 – Acharya: కేజీఎఫ్ 2 ఎఫెక్ట్ ఆచార్యపై గట్టిగానే పడుతుందా..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. గత వారం భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కేజీఎఫ్ ఛాప్టర్ 2. ప్రశాంత్ నీల్, యష్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయిలో వసూళ్ళను రాబడుతోంది. హిట్ అవుతుందని అనుకున్నారు కానీ, ఇంత భారీ హిట్ టాక్ తెచ్చుకొని సౌత్ భాషలతో పాటు హిందీలో కూడా వసూళ్ళ సునామీని సృష్ఠిస్తోంది. ఇప్పటికే దాదాపు అన్నీ భాషలలో కలిపి రూ 700 కోట్ల వరకు వసూళ్ళు వచ్చినట్టు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

will kgf-2-effects acharya
will kgf-2-effects acharya

ఈ నేపథ్యంలో వచ్చే వారం భారీ స్థాయిలో రిలీజ్ కాబోతున్న మెగా మల్టీస్టారర్ సినిమాపై తీవ్రంగా ప్రభావం చూపిస్తుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా ఎరగని కొరటాల శివ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. మెగా మల్టీస్టారర్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఆచార్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజా హెగ్డే ప్రధాన పాత్రల్లో నటించారు. సోనూసూద్, సంగీత కీలక పాత్రల్లో రెజీనా స్పెషల్ సాంగ్‌లో నటించారు.

KGF 2 – Acharya: కేజీఎఫ్ 2 సృష్ఠిస్తున్న సునామీకి టాక్ మాత్రం డిఫరెంట్‌గా..

ఇప్పటికే, ఆచార్య సినిమాపై అంచనాలు భారీగా నెలకొన్నాయి. అయితే, ఇది పాన్ ఇండియన్ సినిమా కాదు. కాబట్టి కేజీఎఫ్ 2 ప్రభావం పడే అవకాశాలు గట్టిగానే ఉన్నాయని ప్రచారం అవుతోంది. ఆచార్య సినిమా మొదటి షో టాక్ తర్వాత అసలు విషయం ఏంటనేది డిసైడవుతుంది. ఆర్ఆర్ఆర్ సినిమాతో రామ్ చరణ్ పాన్ ఇండియన్ స్టార్‌గా మారాడు. అది ఇప్పుడు ఆచార్య సినిమాకు అంచనాలు మరో రేంజ్‌లో పెరిగేలా చేసింది. ఇక చిరంజీవి అంటే ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి అంచనాలుంటాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయినా కూడా కేజీఎఫ్ 2 సృష్ఠిస్తున్న సునామీకి టాక్ మాత్రం డిఫరెంట్‌గా వినిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Related posts

Mahesh – Trivikram: ఉంటుందా ఉండదా అనుకున్న కాంబోపై సూపర్ క్లారిటీ ఇచ్చేశారుగా..

GRK

వకీల్ సాబ్ టీజర్ రెడీ..ఫ్యాన్స్ బీ రెడీ ..?

GRK

కోల్‌క‌త్తాకు `RRR`

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar