Subscribe for notification
Categories: సినిమా

Koratala Siva: కొరటాల-వెంకటేష్ కలిసి డ్రీమ్ ప్రాజెక్ట్ సెట్ చేయనున్నారా?

Share

Koratala Siva: కొరటాల శివ ఈరోజే ‘ఆచార్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. చిరంజీవి – రామ్ చరణ్ కలిసి నటించిన ఈ చిత్రం ఈరోజు విడుదలై దుమ్ము దులుపుతోంది. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా పలు ఇంటర్వ్యూలో మాట్లాడిన శివ.. తదుపరి చిత్రాల వివరాలు మరియు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి వెల్లడించారు. స్వామీ వివేకానంద మీద సినిమా ఓ తీయాలని, ‘గాంధీ’ మూవీ స్థాయిలో ప్రపంచం మొత్తం చూసేలా ఓ సినిమా చేయాలని వుందని తన ఆశలను వ్యక్తం చేసాడు. ఈ సందర్భంగా నేను తెలుసుకున్న మోస్ట్ పవర్ ఫుల్ సోల్ వున్న వాళ్లలో స్వామి వివేకానంద ఒకరు అని కొరటాల తెలపడం కొసమెరుపు.

Will Koratala-Venkatesh set up a dream project together?

Koratala Siva: వీరి కాంబినేషన్లోనే వుంటుందా?

ఇలా కొరటాల ఆ విషయం చెప్పారో లేదో, అలా ఆ విషయం వైరల్ అయిపోయింది. ఇందులో ఏ హీరో నటిస్తే బాగుంటుందనే చర్చ అప్పుడే సోషల్ మీడియాలో మొదలైంది. స్వామీ వివేకానందను అమితంగా ఇష్టపడే విక్టరీ వెంకటేష్ ఆయన కథతో సినిమా చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్న విషయం తెలిసినదే. వివేకానంద బోధనల ప్రభావం తనపై ఎంతగానో ఉందని.. అందుకే ఆయన కథతో సినిమా చేయాలనుకుంటున్నాని వెంకీ చెబుతూ వస్తున్నారు. కానీ వెంకటేష్ డ్రీమ్ ప్రాజెక్ట్ కు సరైన దర్శకుడు తారసపడకపోవడంతో ఇది ఆలస్యమవుతూ వస్తోంది.

Will Koratala-Venkatesh set up a dream project together?

ఇపుడు ఆ కల నెరవేరనుందా?

ఇక ఈ ఇద్దరి డ్రీమ్ ఐడియా ఒకటే కాబట్టి వెంకటేశ్ – కొరటాల శివ కాంబినేషన్ లో వివేకానంద సినిమా చేస్తే బాగుంటుందని సినీ అభిమానులు ఫీల్ అవుతున్నారు. వివేకానంద ఇండియాని ఎంత బాగా ప్రభావితం చేసారో తెలియంది కాదు. అంతేకాకుండా భారతదేశ ధర్మాన్ని దశదిశలా వ్యాపింపజేసిన మొదటి వ్యక్తి స్వామి వివేకానంద. సోషల్ మీడియా – మీడియా వంటివి ఏమీ లేని రోజుల్లో.. అంటే 19వ శతాబ్దంలోనే అంత ఇన్ఫ్లూయెన్స్ చేశారంటే ఆయన ఎలాంటి పర్సనాలిటీయో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ఆయనపై సినిమా తీయడమంటే మామ్మూలు విషయం కాదు.


Share
Ram

Recent Posts

Prabhas: ప్ర‌భాస్ ఆ డైరెక్ట‌ర్ కు హ్యాండ్ ఇవ్వ‌డం ఖాయ‌మేనా?

Prabhas: పాన్ ఇండియా స్టార్‌గా స‌త్తా చాటుతున్న టాలీవుడ్ మిస్ట‌ర్ ప‌ర్ఫెక్ట్ ప్ర‌భాస్ వ‌రుస భారీ చిత్రాలతో ఎంత బిజీగా…

30 mins ago

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ బీజేపీ నుండి దూరం అవుతున్నట్లే(నా)..! ఈ ప్రసంగంలో భావం అలానే ఉందిగా..!?

Pawan Kalyan: రాష్ట్రంలో బీజేపీతో జనసేన పొత్తులో ఉంది. జనసేనతోనే మా పొత్తు ఇంక ఏ పార్టీతోనూ మాకు పొత్తు లేదు…

1 hour ago

Shriya Saran: ఎంత భ‌ర్తైతే మాత్రం రోడ్డుపై అత‌డితో అంత రెచ్చిపోవాలా శ్రియా..?

  Shriya Saran: అందాల భామ శ్రియ‌ సరన్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. `ఇష్టం` మూవీతో సినీ కెరీర్‌ను…

2 hours ago

CM YS Jagan: కుమార్తె హర్ష ప్రతిభకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎం వైఎస్ జగన్ ట్వీట్

CM YS Jagan: ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రస్తుతం పారిస్ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. తన కుమార్తె హర్ష…

2 hours ago

Vijay Deverakonda: విజ‌య్ న‌గ్న ఫొటోను వ‌ద‌ల‌డం వెన‌క అస‌లు కార‌ణం ఏంటో తెలుసా?

Vijay Deverakonda: టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ తొలి పాన్ ఇండియా చిత్రం `లైగ‌ర్‌`. డాషింగ్ అండ్ డైన‌మిక్…

2 hours ago

Udaipur Murder: ఉదయ పూర్ టైలర్ హత్య కేసు నిందితులపై కోర్టు ప్రాంగణంలో దాడి

Udaipur Murder: రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లో టైలర్ కన్నయ్య కుమార్ ను దారుణంగా హత్య చేసిన నిందితులపై జైపూర్…

3 hours ago