ప్రస్తుతం వేణు శ్రీరాం దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమా చేస్తున్నాడు. దాదాపు చిత్రీకరణ మొత్తం పూర్తవగా ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాల్గొనాల్సిన కొద్ది రోజుల షూటింగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. మిగతా కొన్ని రోజుల టాకీ పార్ట్ ని నివేదా థామస్, అంజలి, అనన్య నాగళ్ళ, ప్రకాష్ రాజ్, సినియర్ నరేష్ ల మీద చిత్రీకరిస్తారట. ఇందుకోసం అన్నపూర్ణ స్టూడియో కోర్ట్ సెట్ కూడా సిద్దంగా ఉంది.
ఇక ఈ సినిమా తర్వాత ప్రముఖ నిర్మాత ఏ.ఎం.రత్నం సూర్య మూవీస్ నిర్మాణంలో క్రిష్ తెరకెక్కించే సినిమాలో పవన్ కళ్యాణ్ నటించేందుకు సర్వం సిద్దం అవుతోంది. ఇప్పటి వరకు ఈ సినిమాని కూడా పవన్ కళ్యాణ్ లేకుండానే క్రిష్ మిగతా నటీనటుల కాంబినేషన్ లో కొన్ని కీల సన్నివేశాలను ను చిత్రీకరించాడు. అయితే ఆగస్టు నుండి పవన్ కళ్యాణ్ మీద సీన్స్ తీయాలని అనుకున్న దత్శక నిర్మాతలకి పెద్ద షాక్ తగిలింది. అదే వేసిన కోటి రూపాయల సెట్ కూలిపోవడం. దాంతో మళ్ళీ వేరే సన్నివేశాలను తెరకెక్కించేందుకు క్రిష్ ప్లాన్ చేస్తున్నాడు.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి క్రిష్ కోపం తెప్పిస్తాడన్న వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఏ సినిమా చేసిన అందులో ఫ్యాన్స్ ని అలరించే సాంగ్స్, పవన్ కళ్యాణ్ పాడే సాంగ్ గాని ఆయన మాస్ గెటప్ లో కనిపించే సాంగ్స్ గాని తప్పకుండా ఉండేవి. కాని క్రిష్ ఈ తాజా చిత్రంలో అవేమీ పెట్టడం లేదట. కథ రిత్యా మాస్ సాంగ్స్ గాని ఫ్యాన్స్ ని అలరించే..ఉత్సాహాన్నిచ్చే సాంగ్స్ ఉండే ఆస్కారం లేదని తెలుస్తుంది. మరి ఇది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి.