Categories: సినిమా

Mahesh Babu: మహేష్ ఆ బాలీవుడ్ బడా అఫర్ కి OK చెబుతాడాలో లేదో?

Share

Mahesh Babu: ఇప్పుడు మన టాలీవుడ్ స్థాయి ఆకాశాన్నంటింది. ఇండియాలోని మిగతా సినిమా పరిశ్రమలు మనవైపు తొంగి చూస్తున్నాయి అంటే ఆశ్చర్యం కలగక మానదు. ఇక మన స్టార్ హీరోలు మొదలుకొని మీడియం రేంజ్ హీరోల వరకూ అందరూ పాన్ ఇండియాపైనే టార్గెట్ చేస్తూ ముందుకు దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా తయారవుతున్నాడనే చెప్పాలి. హాలీవుడ్ హీరోని తలపించే కటౌట్ మహేష్ సొంతం. ఇక తమ హిందీ సినిమాలలో మహేష్ ని నటింపచేయాలని బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ఎన్నాళ్ళుగానో ప్రయత్నాలు చేస్తున్న విషయం విదితమే. అయితే మన ప్రిన్స్ మాత్రం ఆ వైపుకు అడుగులు వేయలేదు. కేవలం మన తెలుగు సినిమాలే చేసుకుంటూ పోతున్నారు.

Will Mahesh say OK to that Bollywood bada offer?

Mahesh Babu: మహేష్ తాజా బాలీవుడ్ ప్రాజెక్ట్

Will Mahesh say OK to that Bollywood bada offer?

అయితే బాలీవుడ్ ఎంట్రీ గురించి సందర్భానుసారంగా మీడియా ప్రశ్నించిన ప్రతీసారి.. తాను తెలుగు సినిమాలతో చాలా సంతోషంగా ఉన్నానని.. ఇక్కడ చేయాల్సింది చాలా ఉందని చెబుతూ వస్తున్నారు మహేశ్. ఈ క్రమంలో ఓ విలేఖరి అడిగినదానికి బదులుగా.. తెలుగు సినిమానే పాన్ ఇండియా లెవెల్ లో సత్తా చాటుతుంటే హిందీ సినిమా చేయాల్సిన అవసరం లేదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పడం మనం చూసాం. అయినప్పటికీ సూపర్ స్టార్ తో సినిమా చేయడానికి పలువురు బాలీవుడ్ ఫిలిం మేకర్స్ ట్రై చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో లేటెస్టుగా హిందీ చిత్రాల దర్శకుడు సూరజ్ భర్జత్య.. మహేష్ తో ఓ సినిమా చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని తెలుస్తోంది.

నమ్రతకు స్టోరీ చెప్పిన దర్శకుడు

ఇక అసలు విషయంలోకి వెళితే, బాలీవుడ్ లో ఫ్యామిలీ ఆడియెన్స్ ఫేవరేట్ డైరెక్టర్ అయినటువంటి సూరజ్.. ‘మైనే ప్యార్ కియా’ ‘హమ్ ఆప్ కే హై కోన్’ ‘హమ్ సాత్ సాత్ హైన్’ ‘వివాహ్’ వంటి సినిమాలతో ప్రేక్షకులను అలరించారు. ఈయన సినిమాలు తెలుగులోకి కూడా డబ్ అయ్యి మంచి వసూళ్లు రాబట్టాయి. ఇటీవల వచ్చిన ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ చిత్రం కూడా బానే ఆడింది. ప్రస్తుతం ‘ఊన్చాయ్’ అనే మూవీ చేస్తున్న సూరజ్ తన నెక్స్ట్ ఫిలిం టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరైన మహేష్ తో సినిమా చేయాలని చూస్తున్నారట. ఈ నేపథ్యంలో తాజాగా నమ్రతను కలిసి ఓ స్టోరీ కూడా నేరేట్ చేసారట. మరి ఈ చిత్రమైనా మన ప్రిన్స్ ఒప్పుకుంటాడో లేదో చూడాలి మరి.


Share

Recent Posts

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

57 mins ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

1 hour ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago

వాయువ్య బంగాళాఖాతంలో వాయుగుండం .. ఉత్తరాంధ్ర, యానాంలో భారీ వర్షాలు

బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. వాయువ్య బంగాళాఖాతంలో ..ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం వాయుగుండంగా మారిందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ అర్దరాత్రికి…

6 hours ago