Nabha natesh: నభా నటేశ్ చేసిన ఆ పొరపాటే ఇప్పుడు అవకాశాలు రాకపోవడానికి కారణమా..?

Share

Nabha natesh: ‘నన్ను దోచుకుందువటే’, ‘అదుగో’ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ నభా నటేశ్. ఈ రెండు సినిమాలు సో సోగా ఆడినప్పటికి డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో స్టార్ హీరోయిన్ అనే క్రేజ్ దక్కించుకుంది. ఈ సినిమాలో నభా నటేశ్ అందాల ఆరబోత మాత్రమే కాదు ఘాటు పర్ఫార్మెన్స్‌తోనూ విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వెంట వెంటనే అవకాశాలు దక్కాయి. మాస్ మహారాజ రవితేజ
సరసన ‘డిస్కోరాజా’, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ సరసన ‘అల్లుడు అదుర్స్’, నితిన్‌తో ‘మాస్ట్రో’ చిత్రాలు చేసింది.

will nabha-natesh get chance in new year
will nabha-natesh get chance in new year

ఈ మూడు సినిమాలలో కనీసం ఒకటైనా బ్లాక్ బస్టర్ సాధించి ఉంటే నభా కెరీర్ మరోలా ఉండేదేమో. కానీ, ఒకదానిని మించి ఒకటి అనేట్టుగా ఫ్లాప్ సినిమాల లిస్ట్‌లో చేరింది. అదే సమయంలో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో వచ్చిన క్రేజ్ కారణంగా వరుస అవకాశాలు దక్కడంతో రెమ్యునరేషన్ కూడా బాగా డిమాండ్ చేసిందట. దాంతో ఆమె నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాపవడం..అయినా ఎక్కువ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి వస్తుండటంతో మెల్లగా దర్శక, నిర్మాతలు ఆమెను పక్కన పెట్టేసినట్టు ఇప్పుడు టాక్  వినిపిస్తోంది.

Nabha natesh: ఇన్స్టాగ్రాం లో రోజు రోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ పెంచేసుకుంటుంది.

కారణాలేవైనా ప్రస్తుతం అమ్మడి చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. అందాల ఆరబోతకు అడ్డు చెప్పకుండా..అంతో ఇంతో నటన వచ్చి కూడా నభా లాంటి వారు అవకాశాలు దక్కించుకోలేపోవడం షాకింగ్ విషయమే. ఇక సినిమాలు ఉన్నా లేకపోయినా సోషల్ మీడియాలో రచ్చ చేయడం మాత్రం మానడం లేదు. లేటెస్ట్ గ్లామర్ పిక్స్‌తో నెటిజన్స్‌ను బాగా ఆకట్టుకుంటోంది. ఆమె ఇన్స్టాగ్రాం లో రోజు రోజుకీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెగ పెంచేసుకుంటుంది. మరి ఈ కొత్త సంవత్సరంలోనైనా నభా నటేశ్ కొత్త అవకాశాలు అందుకొని
సక్సెస్ సాధిస్తుందేమో చూడాలి.


Share

Related posts

మ‌నంద‌రికీ క‌రోనా వ్యాక్సిన్ …మోదీజీ సంచ‌ల‌న నిర్ణ‌యం

sridhar

సైకిల్ తొక్కుతూ రచ్చ రచ్చ చేసిన బిగ్ బాస్ హారిక?

Varun G

Karthika Deepam: అవమానంతో రగిలిపోతున్న రుద్రాణి, వంటలక్కను ఇండైరెక్ట్ గా దెబ్బ కొడుతుంది.!

Ram