NTR – Buchibabu: టాలీవుడ్ అగ్ర దర్శకుడు సుకుమార్ శిష్యుడు ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌కు సానా బుచ్చిబాబు పరిచయమవుతూ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. డెబ్యూ హీరోగా వైష్ణవ్ తేజ్‌కు భారీ కమర్షియల్ హిట్ ఇచ్చాడు. కృతిశెట్టి లాంటి లక్కీ గాళ్‌ను తీసుకొచ్చాడు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ సంస్థలోనే ‘ఉప్పెన’ మూవీ చేస్తున్న సమయంలోనే మరో సినిమాను కూడా చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో బుచ్చిబాబు నెక్స్ట్ సినిమాలో నటించేందుకు స్టార్ హీరోల నుంచి పిలుపొచ్చింది.
కానీ, బుచ్చిబాబు మాత్రం తన నెక్స్ట్ సినిమాను యంగ్ టైగర్ ఎన్టీఆర్ తోనే చేయాలని గట్టిగా డిసైడయ్యాడు. ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ అనుకుంటున్నట్టు కూడా బుచ్చిబాబు ఈ మధ్యనే చెప్పుకొచ్చాడు. అయితే, తారక్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సక్సెస్ మూడ్‌లో ఉన్నాడు. త్వరలో కొరటాల శివ దర్శకత్వంలో తన 30వ సినిమాను పట్టాలెక్కించబోతున్నాడు. గతంలో వీరి కాంబినేషన్లో జనతా గ్యారేజ్ అనే సినిమా వచ్చి భారీ కమర్షియల్ సక్సెస్ అందుకుంది. దాంతో కొరటాల – తారక్‌ల సినిమాపై భారీగా క్రేజ్ ఏర్పడింది.
NTR – Buchibabu: బుచ్చిబాబు మాత్రం దీనికి ఒప్పుకోలేదని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఇప్పుడు బుచ్చిబాబు పెద్ది సినిమాకు కొత్త సమస్య ఏర్పడినట్టు సొషల్ మీడియాలో తాజాగా వార్తలు వచ్చి వైరల్ అవుతున్నాయి. ఈ సినిమా కథ తారక్‌కు బాగా నచ్చి గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న దీనిలో ఎన్టీఆర్ దివ్యాంగుడిగా కనిపించాలట. కథకు ఈ ఎపిసోడ్ చాలా ముఖ్యమైనదట. కానీ, అలా కనిపిస్తే ఫ్యాన్స్ కి నచ్చదేమో అనే సందేహాన్ని తారక్ వెలిబుచ్చినట్టు తెలుస్తోంది. అందుకే, ఈ ఎపిసోడ్‌ను కథ మార్చమని సలహా ఇచ్చాడట. కానీ, దర్శకుడు బుచ్చి బాబు మాత్రం దీనికి ఒప్పుకోలేదని తెలుస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. మరి తారక్‌ను కన్విన్స్ చేస్తాడా లేక ప్రాజెక్ట్ వదులుకుంటాడో మరికొన్ని రోజుల్లో తేలిపోనుంది.