న్యూస్ సినిమా

Prabhas: సలార్ అప్‌డేట్స్ ఇవ్వకపోతే ఈసారీ ఫ్యాన్స్‌ను తట్టుకోవడం కష్టమే..!

Share

Prabhas: అప్‌డేట్స్ విషయంలో అందరికంటే ఎక్కువ ఫ్రస్టేట్ అయ్యేది డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్సే అని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే రాధే శ్యామ్ సినిమా విషయంలో అభిమానులు సోషల్ మీడియా వేదిక ఎంత వార్ చేశారో అందరికీ తెలిసిందే. దర్శక, నిర్మాతలకు ట్వీట్స్ పెట్టి అప్‌డేట్స్ ఇవ్వడం లేదని చాలాసార్లు నానా రచ్చ చేశారు. ఇక ఇటీవల బాగా ఫ్రస్టేట్ అవుతుంది ఎన్.టి.ఆర్ ఫ్యాన్స్. ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ నుంచి ఆచార్య సినిమా రాబోతోంది. ఇక ఇప్పటికే శంకర్ దర్శకత్వంలో ఆర్సీ 15 చేస్తున్నారు.

will prabhas-salaar makers give update
will prabhas-salaar makers give update

అలాగే, గౌతం తిన్ననూరి దర్శకత్వంలో కూడా చరణ్ ఓ సినిమాను చేస్తున్నాడు. ఇది కూడా పాన్ ఇండియన్ సినిమానే. కానీ, ఎన్.టి.ఆర్ నుంచి మాత్రం ఇంకా సినిమా ఒక్కటి కూడా సెట్స్ మీదకు రాలేదు. ఈ విషయంలో ఆయన అభిమానులు సోషల్ మీడియా ద్వారా బాగా ట్రోల్ చేస్తున్నారు. త్వరలో ఎన్.టి.ఆర్ – కొరటాల శివల సినిమా మొదలవబోతోంది. జూన్ నుంచి షూటింగ్ ప్రారంభం కాబోతోంది. అయితే, ప్రస్తుతం ప్భాస్ అభిమానులు చాలా నిరాశలో ఉన్నారు. దీనికి కారణం సాహో, రాధే శ్యామ్ ఫ్లాపవడమే.

Prabhas: అప్‌డేట్ ఇవ్వకపోతే మళ్ళీ ట్రోల్ మొదలు..!

అందుకే, ఆయన నటిస్తున్న సినిమాల అప్‌డేట్స్ బ్యాక్ టు బ్యాక్ కావాలని కోరుకుంటున్నారు. కానీ, ఆ అప్‌డేట్స్ రావడం లేదు. సలార్ సినిమా షూటింగ్ సగం అయిందని సమాచారం. అంతేకాదు ఇప్పుడు జరుగుతున్న నాన్ స్టాప్ షూటింగ్‌తో మే వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అవుతుందని సమాచారం. దాంతో సలార్ సినిమా నుంచి టీజర్ కావాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఒకవేళ అలా అప్‌డేట్ గనక ఇవ్వకపోతే మళ్ళీ ట్రోల్ మొదలుపెట్టేందుకు రెడీగా ఉన్నారట. మరి అంతవరకు పరిస్థితి రాకుండా స్టార్ మేకర్ అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తారో లేదో చూడాలి.


Share

Related posts

Shraddha Das Amazing Images

Gallery Desk

BJP: సోము వీర్రాజు వీరత్వం చూసి సొంత పార్టీ నేతలే భయపడుతున్నారు?

arun kanna

Devatha Serial: హద్దులు మిరుతున్న మాధవ్.. ఆదిత్య బాధకు నువ్వే కారణమా రాధక్క..!

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar