కొన్ని కాంబినేషన్స్‌లో రూపొందే సినిమాలు ప్రారంభం నుండి ఆసక్తిని పెంచితే..మరికొన్ని అనౌన్స్మెంట్ కంటే ముందు నుండే ఆసక్తిని రేపుతాయి. ఇలా జరిగితే ఎలా ఉంటుందోనని ఆసక్తిని రేపే క్రేజీ కాంబినేషన్స్ కొన్ని ఉంటాయి. అలాంటి వాటిలో ప్రభాస్, శంకర్ కాంబినేషన్ ఒకటి. ‘బాహుబలి’ తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఖండాంతరాలు దాటింది. ఈయనతో సినిమా చేయాలని చాలా మంది బాలీవుడ్ దర్శక నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దర్శకుడు శంకర్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారీ సినిమాలు తీయడంలో ఈయనకు ఈయనే సాటి. వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుందని వార్తలు వస్తున్నాయి. ఇందులో నిజా నిజాలేంటో తెలియడం లేదు. కానీ.. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే మాత్రం అటు అభిమానులకు, ఇటు ప్రేక్షకులకు మరో కన్నుల పండుగేనని చెప్పొచ్చు. ప్రస్తుతం కమల్‌హాసన్‌తో ‘ఇండియన్ 2’ చిత్రీకరిచడంలో శంకర్ బిజీగా ఉంటే.. ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందే సినిమాలో ప్రభాస్ నటిస్తున్నారు.
previous post
next post