Liger: పూరి – విజయ్‌ల లెక్క లైగర్ సరి చేస్తుందా..? ప్రస్తుతం సోషల్ మీడియాలో ఇదే న్యూస్ హాట్ టాపిక్‌గా మారింది. విజయ్ దేవరకొండ కెరీర్లో భారీ హిట్స్ ఎంత త్వరగా వచ్చాయో అంతకు మించిన ఫ్లాప్స్ కూడా అంతే త్వరగా వచ్చాయి. ఎవడే సుబ్రమణ్యం సినిమాలో చిన్న రోల్ చేసి ఆకట్టుకున్న విజయ్..ఆ తర్వాత పెళ్లి చూపులు సినిమాతో డీసెంట్ హిట్ అందుకున్నాడు. ద్వారక సినిమా హిట్ టాక్ తెచ్చుకున్నా చివరికి యావరేజ్‌గానే మిగిలింది. ఇక అర్జున్ రెడ్డి టాలీవుడ్లో ఎంతటి సంచలన విజయం అందుకుందో అందరికీ తెలిసిందే.
ఇదే సినిమా విజయ్‌కు టాలీవుడ్లో రౌడీ హీ రో ఇమేజ్ను తెచ్చిపెట్టింది. బాలీవుడ్లో అందరి దృష్ఠి పడింది. గీత గోవిందం డీసెంట్ హిట్ అందుకుంటే…ఆ తర్వాత నుంచి మళ్ళీ సాలీడ్ హిట్ తన ఖాతాలో చేరనే లేదు. డియర్ కామ్రేడ్, నోటా, వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలు ఫ్లాప్స్‌గా మిగిలాయి. టాక్సీవాలా హిట్ సాధించింది. విజయ్ దేవరకొండ నుంచి సినిమా వచ్చి మూడేళ్ళు దాటిపోయింది. ఇప్పుడు పాన్ ఇండియన్ సినిమాగా లైగర్ చేస్తున్నాడు. ఈ సినిమా హిట్ అనేది దర్శకుడు పూరి జగన్నాథ్, విజయ్‌లకు చాలా కీలకం.
Liger: అదే విధంగా కొందరిలో సందేహాలు ఉన్నాయి.
కొన్నేళ్ళ నుంచి వరుసగా ఫ్లాప్స్ అందుకున్న పూరి జగన్నాథ్ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో మళ్ళీ సాలీడ్ హిట్ అందుకున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా సక్సెస్ కోసం వీరిద్దరు కలిసి చేస్తున్న లైగర్..ఇటీవల వచ్చిన ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్, ది కశ్మీర్ ఫైల్స్ కంటే భారీ సక్సెస్ సాధించి బాక్సాఫీస్ వద్ద పాన్ ఇండియన్ సినిమాగా లెక్కలు సరి చేయాల్సి ఉంది. రూ.120 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్న ఈ సినిమా మీద అంచనాలు భారీగానే ఉన్నాయి. అదే విధంగా కొందరిలో సందేహాలు ఉన్నాయి. దీనికి కారణం పూరి సినిమా అయితే బ్లాక్ బస్టర్ లేదా ఫ్లాప్‌గా నిలుస్తుంది. చూడాలి మరి ఈ ఏడాది ఆగస్టులో రాబోతున్న లైగర్ రిజల్ట్ ఎలా ఉంటుందో.