NewsOrbit
న్యూస్ సినిమా

Liger: ‘లైగర్‌’తో పూరి ఆ మ్యాజిక్ రిపీట్ చేయగలడా..?

Liger: పూరి జగన్నాథ్ వరుస ఫ్లాపుల తర్వాత ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. దీనితో పుల్ రీచార్జ్ అయిన పూరి విజయ్ దేవరకొండతో లైగర్ సినిమాను మొదలుపెట్టాడు. నాలుగు నెలల్లో ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. పూరి ఏ సినిమా అయినా 100 రోజుల్లో ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేస్తాడు. కానీ, కరోనా వేవ్స్ కారణంగా మొదటిసారి పూరి సినిమా అనుకున్న సమయానికి పూర్తి చేయలేకపోయాడు. గత ఏడాదే రిలీజ్ కావాల్సిన లైగర్ సినిమా ఈ ఏడాది కూడా రిలీజ్ కాలేకపోయింది.

will puri repeats magic with liger...?
will puri repeats magic with liger

ఎట్టకేలకు వచ్చే ఏడాది ఆగస్టు 25న భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నట్టు అధికారికంగా పూరి బృందం ప్రకటించింది. దాంతో ఇప్పట్లో ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ఏవీ రావని అభిమానులు నీరసపడ్డారు. కానీ, తాజాగా పూరి టీమ్ సాలీడ్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు సర్‌ప్రైజెస్‌ను న్యూ ఇయర్ సందర్భంగా ఇవ్వనున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు తాజాగా సోషల్ మీడియా ద్వారా ఇవ్వబోతున్న ఆ సర్‌ప్రైజెస్ తాలూకా పోస్టర్‌ను వదిలింది. ఈనెల 29న ఉదయం 10:03 గంటలకు ‘ది బిగ్ అనౌన్స్మెంట్’ పేరుతో ఓ వీడియో రిలీజ్ చేయబోతున్నారు.

Liger: బాక్సర్‌గా విజయ్ అంతకు మించి ..

అలాగే, డిసెంబర్ 30వ తేదీన ఉదయం 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్స్ ను విడుదల చేస్తామని, ఇది కాకుండా సాయంత్రం 4:00 గంటలకు స్పెషల్ ఇన్ స్టా ఫిల్టర్ ను విడుదల చేయనున్నామని ప్రకటించారు. ఇక డిసెంబర్ 31 న ‘లైగర్’ ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేయబోతున్నామని ఓ టైమ్ టేబుల్‌తో కూడుకున్న పోస్టర్‌ను విడుదల చేసి ఆసక్తిని రేకెత్తించారు. దాంతో విజయ్ దేవరకొండ అభిమానుల్లో ఆనందం రెట్టింపు అయిది. పూరి అంటే హీరోను ఏ రేంజ్‌లో చూపిస్తాడో అందరికీ తెలిసిందే. ఇందులో బాక్సర్‌గా విజయ్ అంతకు మించి అనేట్టుగా చూపించబోతున్నాడని పోస్టర్స్‌తో తెలిసింది. ఇక లైగర్ సినిమాలో హీరోయిన్‌గా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తోంది. ఇది పాన్ ఇండియన్ సినిమాగా 5 భాషల్లో రిలీజ్ కాబోతోంది.

Related posts

Kumkuma Puvvu April 20 2024 Episode 2160: అంజలి నిశ్చితార్థాన్ని చెడగొడుతుందా లేదా.

siddhu

Mamagaru April 20 2024 Episode 191: గంగాధరికి బోనస్ గా మూడో ముద్దు పెట్టిన గంగ, షాక్ అయినా గంగాధర్..

siddhu

Love Guru OTT: ఓటీటీ ప్రేక్షకులను అలరించేందుకు వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ ” లవ్ గురు “.. ఎక్కడ చూడొచ్చంటే..!

Saranya Koduri

Crak OTT: ఓటిటిలోకి వచ్చేయనున్న అమీ జాక్సన్ యాక్షన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Silence OTT: ఓటీటీలో దుమ్మురేపుతున్న క్రైమ్ థ్రిల్లర్.. టాప్ లో ట్రెండింగ్..!

Saranya Koduri

Actor Raghuvaran: విలన్ రఘువరన్ అంత దీనస్థితిలో మృతి చెందారా?.. చూస్తే కన్నీళ్లు ఆగవు..!

Saranya Koduri

Doordarshan: డీడీ న్యూస్ లోగో రంగు మార్పుపై రేగుతున్న దుమారం

sharma somaraju

Divya Khosla Kumar: చేసింది 5 సినిమాలు.. కానీ ఇప్పుడు ఇండియాలోనే రిచ్చెస్ట్ హీరోయిన్‌!!

kavya N

Guppedanta Manasu April 20 2024 Episode 1055: దత్తత విషయంలో అనుపమ నోరు విప్పి నిజం చెబుతుందా లేదా.

siddhu

Madhuranagarilo April 20 2024 Episode 343: మంగళసూత్రా ఆడవాళ్ళ  ఆరో ప్రాణం అంటున్న ప్రసాద్ రావు, రాధమ్మ కావాలి అంటున్న పండు..

siddhu

Tollywood Actresses: ఈ ఫోటోలో ఉన్న చిన్నారులు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్లు.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

kavya N

Iran – Israel: ఇజ్రాయెల్ సర్కార్‌ను హెచ్చరిస్తూ ఇరాన్ విదేశాంగ మంత్రి కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Premalu: థియేట‌ర్స్ లో సూప‌ర్ హిట్‌.. ఓటీటీలో అట్ట‌ర్ ఫ్లాప్‌.. ప్రేమలు మూవీ కొంప ముంచింది అదేనా..?

kavya N

Elon Musk: టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ భారత్ పర్యటన వాయిదా ..మళ్లీ ఎప్పుడంటే..?

sharma somaraju

Samantha: స‌మంత చేతికి ఉన్న ఆ డైమండ్ వాచ్ ధ‌రెంతో తెలుసా.. ఒక ఇంటినే కొనేయొచ్చు!!

kavya N