RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా విషయంలో రాజమౌళి పడిన కష్టమంతా వృధా అయినట్టేనా..?

Share

RRR: ‘ఆర్ఆర్ఆర్’..ప్రపంచవ్యాప్తంగా మోస్ట్ అవైటెడ్ మూవీ. 2022 ప్రారంభంలో థె బెస్ట్ ఓపెనింగ్ మూవీగా కూడా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అందరూ గట్టిగా ఫిక్సైయ్యారు. ఇప్పటికే రెండు సంవత్సరాలకు పైగా వాయిదా పడుతూ వచ్చిన ఈ పాన్ ఇండియన్ సినిమా ఎట్టకేలకు కొత్త సంవత్సరంలో జనవరి 7 సంక్రాంతి పండుగ సందర్భంగా వచ్చేందుకు షెడ్యూల్ చేసింది రాజమౌళి బృందం. ఈ నేపథ్యంలో గత నెలరోజులుగా ఇక్కడా అక్కడా అని లేకుండా అన్నీ ప్రధాన భాషలలోనూ రాజమౌళి బృందం ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు.

will rajamouli hard work goes waste
will rajamouli hard work goes waste

రాజమౌళితో పాటు హీరోలు ఎన్.టి.ఆర్, రామ్ చరణ్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్, అజయ్ దేవగన్ సహా ఇతర బృందం అందరూ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారు. ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ప్రీ బుకింగ్స్ అవుతున్నాయి. ఇక ఎప్పటికప్పుడు సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి చరణ్, తారక్ పోషిస్తున్న అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్ పాత్రలకు సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ అదే పోస్టర్స్ మీద పదే పదే రిలీజ్ డేట్ కన్‌ఫర్మ్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇప్పటికే కోవిడ్ థర్డ్ వేవ్ ఒమిక్రాన్ రూపంలో మొదలై దేశ విదేశాలతో పాటు ఇండియాలోనూ స్ప్రెడ్ అవుతోంది.

RRR: ‘ఆర్ఆర్ఆర్’ సినిమా మీద దీని ప్రభావం ఊహించని విధంగా ఉంటుందా..!

ఈ నేపథ్యంలో కొన్ని చోట్ల నైట్ కర్‌ఫ్యూ, లాక్ డౌన్ విధిస్తున్నారు. మన తెలుగు రాష్ట్రాలలో దీని ప్రభావాన్ని బట్టి ఇక్కడ కూడా వీటిని అమలు చేసేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇదే ఓ పెద్ద సమస్య అయితే ఏపీలో తగ్గించిన టికెట్ రేట్ల కారణంగా 30 థియేటర్స్ వరకు మూసేశారు. రానున్న రోజుల్లో మరింతగా ఈ ప్రభావం సినిమాల మీద గట్టిగా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఇది సినిమా ఇండస్ట్రీకి పెద్ద దెబ్బే. ఇప్పటికే నాని, అఖండ సినిమాలకు ఏపీలో వసూళ్ళ పరంగా భారీగా దెబ్బపడింది. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ సినిమా మీద దీని ప్రభావం ఊహించని విధంగా ఉంటుందని క్లియర్‌గా అర్థమవుతోంది. ఇన్నేళ్ళు కష్టపడిన రాజమౌళి సినిమా ప్రమోషన్స్ కోసం ఎంతగా శ్రమిస్తున్నారో ప్రత్యక్షంగానూ చూస్తున్నాము. ఒకవేళ ఒమిక్రాన్ వల్ల పోస్ట్ పోన్ అవడం..ఏపీలో టికెట్ రేట్స్ వల్ల వసూళ్ళ పరంగా బాగానే నిర్మాతకు నష్టం వస్తుందని చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో.


Share

Related posts

Breaking : రిలయన్స్ అధినేత ముకేష్ అంబానీ నివాసం వద్ద పేలుడు పదార్ధాల కలకలం

somaraju sharma

కమ్మేసిన మంచు- ఏడుగురు మృతి

Siva Prasad

కాపులు ఓట్లు, కాపులు ఓట్లు, కాపులు ఓట్లు వీటి కోసం పడిచస్తున్న నాయకులు..!!

sekhar