RRR: టాలీవుడ్ దర్శకధీరుడు రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన లేటెస్ట్ భారీ మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’. ‘బాహుబలి’ సిరీస్ లాంటి చరిత్ర సృష్టించిన సినిమాల తరువాత రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ పాన్ ఇండియా చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ – యంగ్ టైగర్ ఎన్టీఆర్ మొదటిసారి కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచానాలున్నాయి. 5 సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా ఫైనల్‌గా మార్చి 25న విడుదలకు సిద్ధమవుతోంది.
ఇద్దరు టాలీవుడ్ స్టార్ హీరోలు అయిన రామ్ చరణ్ ..అల్లూరి సీతారామరాజు గా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీంగా ఫ్రీడమ్ ఫైటర్స్ పాత్రల్లో నటించడంతో ఈ సినిమాను జక్కన్న ఎలా రూపొందించారో అని అందరూ ఎంతో ఆసక్తిగా ఉన్నారు. దానయ్య దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఆర్ఆర్ఆర్ యూఎస్‌లో అడ్వాన్స్ బుకింగ్‌లో కొత్త రికార్డ్స్ నమోదవుతున్నాయి. అక్కడ భారీ స్థాయిలో ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ ప్రీమియర్స్‌కే భారీగా క్రేజ్ వచ్చింది.
RRR: భారీ స్థాయిలో రాజమౌళి ప్రీమీయర్ షోస్ ప్లాన్ చేస్తున్నారట.
ఇది చూసి ఇక్కడ కూడా ఇదే రేంజ్లో రాజమౌళి ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఒకరోజు ముందుగా అంటే మార్చి 24వ తేదీనే ఇండియా వైడ్‌గా ఆర్ఆర్ఆర్ సినిమా ప్రీమియర్స్ పడేలా జక్కన్న ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎటూ రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా భారీ బడ్జెట్ సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వీలు కల్పించింది. ఇక తెలంగాణలో 5వ ఆటకు అనుమతి లభించింది. దాంతో ఆర్ఆర్ఆర్ చిత్రానికి భారీ స్థాయిలో రాజమౌళి ప్రీమీయర్ షోస్ ప్లాన్ చేస్తున్నారట. చూడాలి మరి వీలవుతుందో లేదో. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ హాలీవుడ్ సౌత్ సూపర్ స్టార్స్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.