Ram Charan: ప్రస్తుతం రామ్ చరణ్ స్థాయి తారాస్థాయికి చేరుకుందనే చెప్పుకోవాలి. జక్కన్న డైరెక్ట్ చేసిన RRR సినిమా ఏస్థాయిలో జనాల మన్ననలు పొందిందో చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో నటించిన రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ఏ స్థాయిలో జనాలను అలరించాలో ఇక్కడ ప్రసవవించాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఈ సినిమలో రామ్ పాత్రను పోషించినటువంటి రామ్ చరణ్ ని నార్త్ జనాలు నిజంగా రాముడిగా చూడటం మొదలుపెట్టారు. ఈ తరుణంలో మాజీ విశ్వసుందరి కూడా రామ్ చరణ్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ హలో వైరల్ గా మారాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆ సుందరాంగి మనసులోని మాట ఇదే:
2017లో మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్న “మనుషి చిల్లర్” రామ్ చరణ్ పై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకుంది. ఇటీవల ఓ మీడియా వేదికగా ఆమెని ఓ విలేఖరి ఈ విధంగా ప్రశ్నించాడు.. మీకు అవకాశం వస్తే ఏ స్టార్ హీరోతో డేట్ కి వెళ్లడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు? అని అడగగా ఆమె దానికి బదులుగా నిజంగా ఇది చాలా సంక్లిష్టమైన ప్రశ్న అంటూనే, తాను ఎక్కువగా రామ్ చరణ్ ను ఇష్టపడతానని అయితే అతనికి పెళ్లి జరిగిపోయింది కాబట్టి ఇప్పుడా అవకాశం లేదు అని సమాధానం ఇచ్చింది. దాంతో అతనితో అవకాశం వస్తే ఏదైనా మూవీకి లేదా డిన్నర్ కు వెళ్తాను అంటూ మనిషి తన మనసులోని కోరికను తెలియజేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఆయనతో నటించాలని వుంది?
అక్కడితో ఆగకుండా మనిషి భవిష్యత్తులో తనతో నటించే అవకాశాన్ని ఆ భగవంతుడు తప్పక తీరుస్తాడని నమ్ముతున్నానని సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దాంతో మెగాభిమానుల ఆనందాలకు అవధులు లేకుండా పోతున్నాయ. ఇకపోతే, మనుషి చిల్లర్ అక్షయ్ కుమార్ ప్తుథ్వీ రాజ్ సినిమాలో హీరోయిన్ గా నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా త్వరలోనే విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఇచ్చిన ప్రమోషనల్ ఇంటర్వ్యూలో ఇలా స్టార్ హీరోల పై తన అభిమానాన్ని చాటుకుంది.