న్యూస్ సినిమా

RRR – F 3: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ‘ఎఫ్ 3’ అవుట్..ఇంకా ఎన్ని సినిమాలు మళ్ళీ రీ షెడ్యూల్ అవుతాయో..?

Share

RRR – F 3: ‘ఆర్ఆర్ఆర్’ దెబ్బకు ‘ఎఫ్ 3’ అవుట్..ఇంకా ఎన్ని సినిమాలు మళ్ళీ రీ షెడ్యూల్ అవుతాయో..? అంటూ నెటిజన్స్ సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారట. దీనికి కారణం తాజాగా ఆర్ఆర్ఆర్ మూవీ మేకర్స్ రెండు రిలీజ్ డేట్స్‌ను ఫిక్స్ చేసిన విషయాన్ని అఫీషియల్‌గా ప్రకటించడమే. మెగా పవర్ స్టార్
రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ హీరోలుగా ..ఆలియా భట్, ఓలివియా మోరీస్ హీరోయిన్స్‌గా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ చిత్రాన్ని పలు వాయిదాల తర్వాత ఫైనల్‌గా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 7న రిలీజ్ చేయాలని అనుకున్నారు.

will reschedule of rrr effects f3
will reschedule of rrr effects f3

ఈ మేరకు దాదాపు రూ.20 కోట్ల వరకు ఖర్చు చేసి భారీ ఎత్తున ప్రమోషన్స్ కూడా నిర్వహించారు. కానీ, కరోనా థర్డ్ వేవ్ వ్యాప్తి కారణంగా మరోసారి వాయిదా చేయాల్సి వచ్చిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం రెండు రిలీజ్ డేట్స్‌ను ఆర్ఆర్ఆర్ బృందం లాక్ చేసినట్లు సోషల్ మీడియా వేదికగా
ప్రకటించారు. అంతేకాదు, దేశవ్యాప్తంగా పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని 2022 మార్చి 18న విడుదల చేస్తామని ఒకవేల కుదరకపోతే ఏప్రిల్ 28న థియేటర్లలో భారీ స్థాయిలో విడుదల చేస్తామని ఓ ఆసక్తికరమైన పోస్టర్‌ను రిలీజ్ చేసి పేర్కొన్నారు.

RRR – F 3: ఈ ప్రకటనే ‘ఎఫ్ 3’ చిత్రానికి ఇబ్బందులు..!

ఇప్పుడు ఈ ప్రకటనే ‘ఎఫ్ 3’ చిత్రానికి ఇబ్బందులు కలిగిస్తోందని టాక్ మొదలైంది. బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కి కొనసాగింపుగా విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా..తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 3’. అనిల్ రావిపూడి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు
సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్ ఈ మూవీని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. అయితే ఇప్పటికే ఎఫ్ 3 బృందం ఏప్రిల్ 28న రిలీజ్ చేయనున్నట్టు ప్రకటింప చేశారు. కానీ, ఇప్పుడు ఆర్ఆర్ఆర్ ఫిక్స్ చేసుకున్న డేట్స్‌లో ఏప్రిల్ 28 కూడా ఉండటంతో మళ్ళీ ఎఫ్ 3కి రీ షెడ్యూల్ తప్పదా అని ప్రచారం జరుగుతోంది. చూడాలి మరి ఆర్ఆర్ఆర్ చిత్రానికి పోటీగా ఎఫ్ 3 ని కూడా ఏప్రిల్ 28న రిలీజ్ చేస్తారా లేక మళ్ళీ కొత్త డేట్ ప్రకటిస్తారా.


Share

Related posts

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఏ హీరో చేయని ప్రయోగం చెయ్యబోతున్న శర్వానంద్ !!

sekhar

Nora Fatehi Joshful Pictures

Gallery Desk

మ్యూజిక్ ఆల్బ‌మ్‌లో రెహ‌మాన్ త‌న‌యుడు

Siva Prasad
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar