RRR: ఇప్పుడు అందరికి దృష్ఠి భారీ పాన్ ఇండియన్ సినిమా ఆర్ఆర్ఆర్ మీదే. ఎందుకంటే ప్రమోషన్స్‌లో భాగంగా పలు ప్రాంతాలలో సుడిగాలి పర్యటన చేస్తూ చిత్రబృందం తీవ్రంగా శ్రమిస్తోంది. టాలీవుడ్ అగ్ర దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో టాలీవుడ్ స్టార్స్ ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలుగా నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపై అసాధారణంగా అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీ కోసం మెగా నందమూరి అభిమానులే కాదు యావత్ సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఈ సినిమా ఇదే నెల 25న భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రపంచ వ్యాప్తంగా 14 భాషల లో అత్యధిక స్క్రీన్ లలో ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల కానుండటం గొప్ప విశేషం అని చెప్పాలి. అయితే, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల సునామీ సృష్టించిన ‘బాహుబలి’ సిరీస్ తర్వాత దర్శకుడు రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడం ఎన్టీఆర్ – రామ్ చరణ్ హీరోలు నటించడంతో.. ‘ఆర్ఆర్ఆర్’ మూవీపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొన్నాయి. ఈ ముగ్గురు పేరు మీదే ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది.
RRR: బాలీవుడ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్..!
ఇక దాదాపు రూ. 478 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిన ఆర్ఆర్ఆర్ చిత్రానికి 900 కోట్ల వరకు అన్నీ రకాలుగా వ్యాపారం జరిగిందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి రోజు కనీసం రూ. 50 కోట్ల షేర్ రాబట్టే అవకాశాలున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇక బాలీవుడ్‌తో పాటు మిగతా రాష్ట్రాల్లో భారీ ఓపెనింగ్స్ వస్తే మాత్రం ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే ఎంత కాదన్నా రూ. 200 కోట్లు గ్రాస్ రాబట్టే అవకాశాలున్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా. మరి ఆ సత్తా చరణ్, తారక్‌లకు ఉందా లేదా అనేది తెలియాలంటే మార్చి 25 వరకు ఆగాల్సిందే.