RRR: కొంచెం తేడాగా టాక్ వచ్చినా ఆర్ఆర్ఆర్కు బాలీవుడ్, కోలీవుడ్‌లో సేమ్ సీన్ రిపీటవుంది..? అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో వార్తలు వచ్చి చక్కర్లు కొడుతు న్నాయి. మరికొన్ని గంటల్లో ఈ సినిమా థియేటర్స్‌లో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది. రాజమౌళి వంటి అగ్ర దర్శకుడు ఎన్టీఆర్ – రామ్ చరణ్ లాంటి టాలీవుడ్ స్టార్ హీరోలు..ఆలియా భట్, అజయ్ దేవగన్ లాంటి బాలీవుడ్ స్టార్స్ ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. రాజమౌళి అంటే అందరూ బాహుబలి సిరీస్ గురించే ఇంకా మాట్లాడుకుంటున్నారు. వాస్తవంగా చెప్పాలంటే ఆర్ఆర్ఆర్ సినిమా మీద అంతటా బజ్ క్రియేట్ అవడానికి కారణం ఈ సినిమానే.
అయితే, ప్రస్తుతం పరిస్థితులు చూస్తుంటే యూఎస్ ప్రీమియర్ టాక్ మీదే సౌత్‌లో గానీ, బాలీవుడ్లో గానీ వసూళ్ళ పరంగా ప్రభావం ఉంటుందని తెలుస్తోంది. ఇప్పుడు హిందీలో గానీ, తమిళం, కన్నడ, మలయాళం భాషలలో పెద్దగా హైప్ క్రియేట్ కాలేదు. రాజమౌళి – ఎన్టీఆర్ – రామ్ చరణ్ ఏ సినిమాకు నిర్వహించనట్టుగా ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ నిర్వహించారు. అయితే, ముఖ్యంగా బాలీవుడ్లో ఈ సినిమాపై పెద్దగా క్రేజ్ రాకపోవ డానికి చాలానే కారణాలున్నాయంటున్నారు.
RRR: ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో తేలిపోతుంది.
అక్కడ ఎన్టీఆర్ – రామ్ చరణ్ లకు పెద్దగా క్రేజ్ లేదు. రాజమౌళి గురించి అక్కడ తెలియ నివారూ ఉన్నారు. ఇక టికెట్ రేట్స్ కూడా అన్నీ చోట్లా మైనస్ అవుతున్నాయి. పైగా ఇది పోరాట యోధుల కథ ఆధారంగా రూపొందిన చిత్రం. దాంతో డ్యూయట్స్ కి స్కోప్ లేదు. ప్రేక్షకులు ఆశించిన కమర్షియల్ అంశాలు తక్కువే అని అభిప్రాయపడుతున్నారు. ఇక బాలీవుడ్లో ఇంతకంటే గొప్ప కథలతో చాలానే సినిమాలొచ్చాయి. కానీ, థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ లాంటి సినిమాలు ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. కాబట్టి బాలీవుడ్ జనాలకు ఇలాంటి సినిమాలు కొత్తేమీ కాదు. మరి జనాలను మెస్మరైజ్ చేసే అంశాలు ఏవైనా ఉన్నాయా ..బ్లాక్ బస్టర్ అని యూఎస్ నుంచి టాక్ వస్తే ఇక్కడ ఆసక్తి పెరిగి లాంగ్ రన్లో టికెట్ బుకింగ్ పెరిగే అవకాశాలున్నాయి. ఒకవేళ ప్రభాస్ రాధే శ్యామ్ సినిమా మాదిరిగా టాక్ వస్తే మాత్రం ఆర్ఆర్ఆర్ సినిమా హిట్ అనేది కష్టమే అంటున్నారు. ఏం జరుగుతుందో కొన్ని గంటల్లో తేలిపోతుంది.