Keerthy Suresh: ప్రముఖ స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ గత కొంత కాలం నుంచి వరుస ఫ్లాపులతో సతమతం అవుతున్న సంగతి తెలిసిందే. `మహానటి` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకుని జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన కీర్తి సురేష్.. ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస పెట్టి సినిమాలు చేసింది. కానీ మహానటి స్థాయిలో హిట్‌ను ఖాతాలో వేసుకోలేకపోయింది.
తెలుగుతో ఈమె నుంచి చివరిగా వచ్చిన పెంగ్విన్, మిస్ ఇండియా, రంగ్ దే, గుడ్ లక్ సఖి చిత్రాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. దీంతో ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని `సర్కారు వారి పాట`తో ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం నిన్న అట్టహాసంగా విడుదలైంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. కానీ, కలెక్షన్స్ పరంగా మాత్రం దూసుకుపోతోంది. తొలి రోజు ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా రూ. 45.21కోట్ల షేర్.. రూ. 70కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది అదరగొట్టేసింది. అమెరికాలో వడ్డీ వ్యాపారం చేసుకునే మహి పాత్రలో మహేశ్ నటిస్తే.. కాసినోలో పేకాట ఆడుతూ లైఫ్ ను ఎంజాయ్ చేసే కళావతిగా కీర్తి చేసింది.
వీరిద్దరి రొమాంటిక్ ట్రాక్ సూపర్‌గా వర్కోట్ అయింది. అలాగే మహేశ్ తర్వాత కీర్తి పాత్రనే సినిమాకు ప్రధాన బలంగా మారింది. కానీ, ఈ సినిమాతో కీర్తి సురేష్ హిట్ కొట్టిందా? లేదా? అన్నది తెలియాలంటే వీకెంట్ వరకు ఆగాల్సిందే. కలెక్షన్స్ విషయంలో ఈ మూవీ ఫస్ట్ డే మాదిరిగానే వారం మొత్తం జోరు చూపిస్తే కీర్తి ఖాతాలో హిట్ పడుతుందని అంటున్నారు. అందుకే వీకెండ్ వరకు వెయిట్ చేయాలని అంటున్నారు.
Tenant OTT Release: ఓటీటీ సినిమాని థియేటర్లలో రిలీజ్ చేస్తున్న కమెడియన్.. క్లారిటీ ఇస్తూ కామెంట్స్..!