https://www.youtube.com/watch?v=5OC5vh1ioks
గతేడాది ఒక చిన్న ఐ వింక్ వీడియోతో నేషనల్ క్రష్ గా మారిపోయిన మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. తను నటించిన మొదటి సినిమా ఒరు అధార్ లవ్ విడుదల కాకముందే అమ్మడికి అన్ని ఇండస్ట్రీల నుంచి వరసగా క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రియా ప్రకాష్ హిందీ డెబ్యూ ఛాన్స్ కూడా కొట్టేసింది. ఎంతో మంది హీరోయిన్స్ ఏళ్ల తరబడి కష్టపడినా రాని బాలీవుడ్ ఛాన్స్ పట్టేసిన ప్రియా, బాలీవుడ్ డెబ్యూ మూవీ పేరు ‘శ్రీదేవి బంగ్లా’. ప్రశాంత్ మాంబుల్లి తెరకెక్కిస్తున్న ఈ సినిమా అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ అయ్యి సినీ అభిమానులకి షాక్ ఇస్తుంది. ట్రైలర్ రిలీజ్ అయితే షాక్ ఎందుకు అనుకుంటున్నారు. మాములు సినిమా అయితే అందరూ లైట్ తీసుకునే వారు కానీ ప్రియా ప్రకాష్ నటిస్తున్న సినిమా అందాలతార శ్రీదేవి ఎలా చనిపోయింది అనే పాయింట్ తో రాబోతుంది, కాబట్టే ట్రైలర్ చూసిన వాళ్లందరూ షాక్ అవుతున్నారు. అందాల ప్రదర్శనకి ఏ మాత్రం వెనక్కి తగ్గని ప్రియా ప్రకాష్, ఇందులో శ్రీదేవి పాత్రలో కనిపిస్తూ మెయిన్ లీడ్ ప్లే చేస్తుంది. ట్రైలర్ లోనే గ్లామర్ షోతో అదరగొట్టిన ఈ మలయాళ ముద్దుగుమ్మ బాలీవుడ్ యూత్ కి బాగానే అట్రాక్ట్ చేసేలా ఉంది. ఇక ట్రైలర్ విషయానికి వస్తే, సినీ హీరోయిన్ శ్రీదేవి లైఫ్ ఎలా ఉండేది, ఎలా మరణించింది అనే విషయం ఈ సినిమాలో చూపించేలా ఉన్నారు. అయితే శ్రీదేవి మరణం సహజమని, బాత్ టబ్ లో పడి చనిపోయిందని క్లీయరెన్స్ కూడా ఇచ్చారు కానీ ఈ శ్రీదేవి బంగ్లా ట్రైలర్ చూస్తుంటే మాత్రం శ్రీదేవి డెత్ నార్మల్ గా కనిపించట్లేదు. ఒక పబ్ లో పూర్తిగా మందు తగిన శ్రీదేవి, అక్కడ ఎవరినో కలిసింది, అక్కడి నుంచి తన హోటల్ రూమ్ కి వెళ్ళింది… స్నానం చేస్తూ చేసిన తప్పుని తలుచుకోనో, లేక ఏదైనా గుర్తొచ్చి బాధతోనో బాగా ఏడ్చింది… కట్ చేస్తే బాత్ టబ్ లో నుంచి రెండు కాళ్లు బయటకి చూపించారు, అంటే అప్పటికే ఆమె మరణించింది. ఈ ట్రైలర్ ప్రకారం చూస్తుంటే శ్రీదేవి స్నానం చేస్తూ బాత్ టబ్ లో పడి చనిపోలేదు, ఆమె బాధతో మరణించింది. మరి ఇది శ్రీదేవి బంగ్లా సినిమా కోసం తీసుకున్న సినిమాటిక్ లిబర్టీనా లేక కథ పూర్తిగా వేరేది తీసుకొని దానికి కొత్త రంగు అద్దారా అనేది చూడాలి. ఇప్పటికైతే ట్రైలర్ చూస్తుంటే మంచి థ్రిల్లర్ సినిమాతో, ఎక్కడా తగ్గని గ్లామర్ షోతో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్ బాలీవుడ్ డెబ్యూకి బాగానే రెడీ అయ్యింది. మరి ఈ సినిమాతో అమ్మడు హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ అయిపొతుందెమో చూడాలి.