Categories: సినిమా

Rajamouli: వెండితెర అద్భుతం, దర్శకధీరుడి విజయ పరంపర పయనమిదే!

Share

Rajamouli: టాలీవుడ్ సినిమా దర్శకుడు S. S. రాజమౌళి గురించి అందరికీ తెలిసిందే. అయితే ఒక్కసారి తన పుట్టు పూర్వోత్తరాలు, విజయ పరంపర గురించి తెలుసుకుందాం. జక్కన్న 1973 అక్టోబరు 10న జన్మించారు.ప్రముఖ తెలుగు సినీ కథారచయిత K. V. విజయేంద్ర ప్రసాద్ కుమారుడు. రాజమౌళి పూర్తిపేరు కోడూరి శ్రీశైల శ్రీ రాజమౌళి. రాఘవేంద్ర రావు శిష్యుడిగా స్టూడెంట్ నెం.1 చిత్రం ద్వారా తెలుగు సినీరంగ ప్రవేశం చేశాడు.అయితే అంతకుముందు TV ధారావాహికలకు పనిచేసాడు.ఇప్పటి వరకూ ఒక్క పరాజయం కూడా చవిచూడకపోవడం రామౌళి ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు.

Winning Streak Continues for SS Rajamouli

Rajamouli: రాజమౌళి విజయ పరంపర

మన జక్కన్న ఇంతవరకు మొత్తం 11 సినిమాలు తీయగా, అన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపించాయి. అంతేకాకుండా ఆయా సినిమాలలో నటించిన హీరోలు అగ్రకథనాయకులుగా చలామణి అవుతున్నారు. స్టూడెంట్ నంబర్1తో మొదలైన జక్కన్న సినీ ప్రస్థానం RRR వరకు అనేక ఒడిదుడుకుల మధ్య అజేయుడిగా నిలిచిన వైనాన్ని కొనియాడకుండా ఉండలేము. ఎవరెన్ననుకున్న, ఒక తెలుగు సినిమాని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన ఘనత ఒక్క రాజమౌళికే చెల్లుతుంది. మాస్ ని థియేటర్లకు పదే పదే రప్పించే దమ్మున్న దర్శకుడు అతడు.

Winning Streak Continues for SS Rajamouli

జక్కన్న విజయ పతాకం

ఇతని సినిమాలు ఒక్క ప్రాంతీయ భాషకే పరిమితం కాలేదు. జాతీయ స్థాయిలో జక్కన్న పేరు మారుమ్రోగుతోంది. వరుసగా బాహుబలి 1 – బాహుబలి 2 – ఆర్.ఆర్.ఆర్ చిత్రాలతో 1000 కోట్ల మార్క్ ని సెట్ చేసాడు. ఒక ఫిక్షన్ ని రియాలిటీకి జోడించి అద్భుత విజువల్స్ క్రియేట్ చేసిన ఘనత ఒక్క రాజమౌళికే దక్కుతుంది. 100 కోట్లు రావడమే గొప్ప అనుకున్న తరుణంలో 1000 కోట్లు ఈజీగా కొల్లగొట్టాడు. ఒక్కమాటలో చెప్పాలంటే, రాజమౌళి నార్త్, సౌత్ అనే భావాజాలాలను తన సినిమాలతో చెరిపేశారనే చెప్పుకోవాలి. సినిమాల ద్వారా మనుషులను ప్రభావితం చెయ్యొచ్చు… కానీ, ప్రాంతాలను కూడా ప్రభావితం చెయ్యొచ్చు అని జక్కన్న తన సినిమాలతో నిరూపించాడు.


Share

Recent Posts

గుండెకు హత్తుకునే సినిమాలు చేయాలి అంటున్న బండ్ల గణేష్..!!

మహమ్మారి కరోనా వైరస్ వచ్చాక ప్రపంచంలో అనేక మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ వైరస్ దాటికి అనేక రంగాలు కుదేలు అయిపోయాయి. ముఖ్యంగా సినిమా రంగం…

24 mins ago

నేను గొర్రెల మంద టైప్ కాదు జబర్దస్త్ షోపై అనసూయ వైరల్ కామెంట్స్..!!

యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెలివిజన్ రంగంలో మరియు సినిమా రంగంలో ఇప్పుడు ఓటీటీలో వరుస ఆఫర్లు అందుకుంటూ సక్సెస్ ఫుల్ కెరియర్ కొనసాగిస్తుంది.…

1 hour ago

వరంగల్ “లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో హీరో విజయ్ దేవరకొండపై పొగడ్తల వర్షం కురిపించిన పూరి..!!

ఆదివారం వరంగల్ లో "లైగర్" ప్రమోషన్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు రాజకీయ నాయకులతోపాటు సినిమా యూనిట్ సభ్యులు హాజరయ్యారు. హీరో విజయ్ దేవరకొండ తో…

2 hours ago

“లైగర్” ప్రమోషన్ కార్యక్రమాలలో మైక్ టైసన్ గురించి ఆసక్తికరమైన విషయాలు చెప్పిన పూరి..!!

"లైగర్" ప్రమోషన్ కార్యక్రమాలు చాలా చురుగ్గా జరుగుతున్నాయి. ఆగస్టు 25వ తారీకు సినిమా విడుదలవుతున్న తరుణంలో ఆగస్టు 13 వరకు ఉత్తరాదిలో విజయ్ దేవరకొండతో పాటు హీరోయిన్…

3 hours ago

హీరోయిన్ల‌కే అసూయ పుట్టిస్తున్న బ‌న్నీ స‌తీమ‌ణి.. లెటేస్ట్ పిక్స్ చూస్తే మైండ్‌బ్లాకే!

అల్లు వారి కోడ‌లు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ స‌తీమ‌ణి స్నేహా రెడ్డి గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. బ‌న్నీ, స్నేహాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2011లో…

4 hours ago

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సర్వం సిద్ధం .. తెలుగు రాష్ట్రాల్లో ఆ కుటుంబాలకు గుడ్ న్యూస్

దేశ వ్యాప్యంగా సోమవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు ప్రభుత్వాలు సిద్ధమైయ్యాయి. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు…

5 hours ago