సినిమా

RC15: హాలీవుడ్ హైలెవెల్ టెక్నాలజీతో… చరణ్ నీ షూట్ చేస్తున్న…శంకర్..??

Share

RC15: సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ దర్శకుడిగా శంకర్ పేరు ఎప్పటినుండో వినబడుతోంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు దక్షిణాదిలో మాత్రమే కాదు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. గ్రాఫిక్స్ వర్క్… విజువల్ వండర్.. సినిమాలో అందమైన లోకేషన్స్ లో షూట్ చేయటంలో.. శంకర్ చాలా సిద్ధహస్తుడు. ఇంత నైపుణ్యం ఉంది కాబట్టే రజినీకాంత్ తో “రోబో” వంటి అద్భుతమైన సినిమాలు చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం శంకర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. చరణ్ కెరీర్లోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమాగా తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి దిల్ రాజు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు.

WITH HOLLYWOOD TECHNOLOGY CAR SEQUENCE CHASE SHOOT SHANKAR

ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి కొన్ని షెడ్యూల్ రాజమహేంద్రవరంతో పాటు పంజాబ్ ఇంకా హైదరాబాద్లో జరగగా ప్రస్తుతం వైజాగ్ లో కొత్త షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటోంది. ఈ క్రమంలో వైజాగ్ బీచ్ రోడ్డు పక్కన చరణ్ నీ ఓ యాక్షన్ సన్నివేశంలో చూపించడానికి హాలీవుడ్ హైలెవెల్ టెక్నాలజీ కెమెరాలనీ శంకర్ తీసుకొచ్చినట్లు లేటెస్ట్ టాక్ ఇండస్ట్రీ లో వినపడుతోంది.

 

బీచ్ ఒడ్డున యాక్షన్ కార్ చేజింగ్ సీక్వెన్స్ ఫైట్ కోసం ఈ కెమెరాలను శంకర్ ఉపయోగిస్తున్నట్లు సమాచారం. సినిమాకి ఈ ఫైట్ చాలా హైలెట్ గా ఉండే రీతిలో థియేటర్ లో ప్రేక్షకులు త్రీల్ ఫీల్ అయ్యే రీతిలో.. షూట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ మూడు డిఫరెంట్ క్యారెక్టర్లు చేసినట్లు తెలుస్తోంది. అందులో ఒకటి పల్లెటూరుకి చెందిన వ్యక్తిగా మరొకటి స్టూడెంట్ పాత్రలో ఇంకొకటి రాజకీయాల్లో ఉండే వ్యక్తిగా మూడు విభిన్నమైన పాత్రలో రామ్ చరణ్ నీ శంకర్ చూపిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.


Share

Related posts

MAA: మోహన్ బాబుపై దూషణ ఎఫెక్ట్ …నటి శ్రీనిజపై మా అధ్యక్షుడు విష్ణు కీలక నిర్ణయం..

somaraju sharma

పవన్ సినిమా తర్వాతే ఏం చేసినా అంటున్నాడు!

Muraliak

Ram : రామ్ హీరోగా మురగదాస్ సినిమా..!

GRK