చదివింది పెద్ద చదువులు.. చేస్తుంది పెద్ద ఉద్యోగం. ఎందరికో ఆదర్శంగా నిలవాల్సిన వాళ్ళే తప్ప తాగి రోడ్లపై హలచల్ చేస్తున్నారు. పోలీసులపై దాడికి పాల్పడుతున్నారు. ఇలాంటి సంఘటనలు రోజురోజుకు ఎక్కువవుతున్నాయి కానీ తగ్గట్లేదు. తాజాగా ఇలాంటి ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. దానికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాల్లోను వైరల్ అవుతుంది.
మందు బాబులం మేము మందు బాబులం.. మందు కొడితే మాకు మేమే మహారాజులం అని నిరూపించింది అసిస్టెంట్ డైరెక్టర్ కామిని. వివరాల్లోకి వెళ్తే అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్న కామిని, సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఐన తన స్నేహితుడు శేషు ప్రసాద్ తాగి కారు నడిపారు. అయితే మార్గమధ్యలో డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్న పోలీసులు కారును ఆపి ఇద్దరికీ పరీక్షలు నిర్వహించారు. అయితే కారు నడుపుతున్న శేషు మోతాదుకు మించి మద్యం తాగాడు. ఆ విషయం తెలియటంతో పోలీసులు కారును సీజ్ చేశారు.
అసిస్టెంట్ డైరెక్టర్ కామిని దీంతో ఆగ్రహం చెందింది. మద్యం మత్తులో ఉన్న ఆమె పోలీసులపై గొడవకు దిగి.. రోడ్డుపై నానా రచ్చ చేసింది. ఆమెను ఆపేందుకు ఎంత ప్రయత్నించినా వినకపోగా ఓ మహిళా పోలీసుల అధికారినిపై బూతులు తిడుతూ దాడికి పాల్పడింది. పోలీసులపై చేయి చేసుకుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.
డ్యూటీలో ఉన్న ప్రభుత్వ అధికారినిపై చేయిచేసుకోవటం నేరం. ఆ విషయం తెలిసి ఉద్దేశపూర్వకంగా చేయటం, దుర్భాషలాడటం, గాయపరచడం, విధులకు ఆటంకం కలిగించడంతో పోలీసులు ఈమె పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇలా సెలబ్రెటిలు తప్ప తాగడం రోడ్డు మీద రచ్చచేయడం మెుదటిసారి ఏమికాదు. చాలా మంది సెలబ్రెటిలు ఇలానే చేసి మీడియా కేమేరాలకు చిక్కారు. ఆ తర్వాత తప్పు తెలుసుకొని పశ్చాతాపం అవడం అలవాటుగా మారింది.