32.2 C
Hyderabad
February 9, 2023
NewsOrbit
Entertainment News సినిమా

Netflix: వరల్డ్ నెంబర్ వన్ OTT.. “నెట్ ఫ్లిక్స్” అసలు చరిత్ర తెలుసా..?

Share

Netflix: మహమ్మారి కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో పలు మార్పులు చోటు చేసుకోవడం తెలిసిందే. ఈ ప్రాణాంతకరమైన వైరస్ కారణంగా పేదవాడు మొదలుకొని సెలబ్రిటీల వరకు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇదే సమయంలో చాలా రంగాలు నష్టపోయాయి. ముఖ్యంగా థియేటర్ వ్యాపారం.. ప్రశ్నార్థకమయ్యింది. ఇలాంటి సమయంలో ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకీ ఓటీటీ వరంలా మారింది. 2019 ముందు వరకు ఓటిటి అనేది పెద్దగా పట్టించుకునే పరిస్థితి లేదు. కానీ 2020 నుండి… కరోనా దాపరించడంతో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో ఓటీటీ రంగం ఇప్పుడు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. థియేటర్ లలో కంటే ఓటీటీ లలో చాలా సినిమాలు, వెబ్ సిరీస్ లు, పలు షోలు ఆకట్టుకుంటున్నాయి.

World number one OTT Do you know the original history of Netflix
World number one OTT Netflix
1997 లో చిన్న సీడీ కంపెనీ

అయితే ప్రపంచవ్యాప్తంగా ఓటీటీ రంగంలో నెట్ ఫ్లిక్స్ సంస్థ నంబర్ వన్ స్థానంలో ఉంది. అసలు నెట్ ఫ్లిక్స్ సంస్థ చరిత్ర… నేపథ్యం చూస్తే ఆశ్చర్య పడాల్సిందే. 1997లో చిన్న సీడీ కంపెనీగా స్టార్ట్ అయి తర్వాత రెడ్ హోస్టింగ్స్ ద్వారా డివిడి బిజినెస్ తరహాలో ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో అడుగుపెట్టిన ఈ సంస్థ 2010లో వీడియో స్ట్రీమింగ్, 2012లో ఒరిజినల్స్ నిర్మాణం స్టార్ట్ చేసి దశాబ్ద కాలంలోనే నెట్ ఫ్లిక్స్ గా ఓటీటీ రంగంలో నెంబర్ వన్ స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలలో నెట్ ఫ్లిక్స్ కి సబ్ స్క్రైబర్స్ ఉన్నారు. దీనీ స్పెషాలిటి ఏంటి అంటే అన్ని ఓటీటీ సంస్థల మాదిరిగా..నెట్ ఫ్లిక్స్ రేటింగ్ అడగదు. దీని కొలమానం ప్రేక్షకుడి యొక్క..రేటింగ్స్ కన్నా… ఎంత సేపు షో చూశారు, ఎప్పుడు ఆపేశారు, ఏ షో పూర్తిగా చూశారు..లాంటి వివరాలే విలువైనవని నమ్ముతుంది. ఆ డేటా సేకరించి లోతుగా పరిశోధన జరిపి రకరకాల కార్యక్రమాలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. వీక్షకుడి అభిరుచీ మేరకు దాదాపు అన్ని డేటా పరిశోధనలు జరిపి 2000 వర్గాలుగా విభజించి ఆ తరహా కార్యక్రమాలు…నెట్ ఫ్లిక్స్ అందుబాటులోకి తీసుకురావడం జరిగింది.

World number one OTT Do you know the original history of Netflix
history of Netflix
మిగతా ఓటిటి లతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ లో 93 శాతం …

టెలివిజన్ పరంగా అయితే పిల్లలు మరియు పెద్దలు అన్న తరహాలో వయసు బట్టి కార్యక్రమాలు ఉంటాయి. కానీ ఈ దిగ్గజ ఓటీటీలో ప్రేక్షకుడి అభిరుచి మాత్రమే ప్రధానంగా తీసుకోవటం జరుగుద్ది. షోలు ప్రసారం చేయడం మాత్రమే కాదు … ఎక్కడెక్కడ నుండి మధ్యలోనే ఆడీయాన్ అని వెళ్ళిపోతున్నాడు. ఎలాంటి షోలు బాగా చూస్తున్నారు వంటి విషయాలు బాగా విశ్లేషణ చేసే టెక్నాలజీ కూడా నెట్ ఫ్లిక్స్ సొంతం. దీంతో మిగతా ఓటిటి సంస్థలతో పోలిస్తే నెట్ ఫ్లిక్స్ లో 93 శాతం షోలు రెన్యూ అయ్యాయి, మిగతా ఓటిటి లలో ఈ రెన్యూ 33 శాతంగా ఉంది. తన సబ్ స్క్రైబర్ కీ ఏం నచ్చుతుంది..? వంటివి రకరకాల డేటా పాయింట్ ల విశ్లేషణ ద్వారా తెలుసుకున్నాకా దాన్ని అమలులో పెట్టి రికమెండేషన్ లను ఇవ్వడంలో.. విజయం సాధించి ఆ దిశగా.. ప్రయోగాలు, అభివృద్ధి చేస్తుంది.

World number one OTT Do you know the original history of Netflix
Netflix
థంబ్‌ నెయిల్ తోనే క్లారిటీ:

థంబ్‌ నెయిల్ తోనే ఇంట్రెస్ట్ కలిగించే రీతిలో కంటెంట్ ఉంటాయి. ఒక్కో ఫ్లేవర్ కంటెంట్ కి… ఆ తరహా థంబ్‌ నెయిల్ ద్వారానే తెలియజేసి నెట్ ఫ్లిక్స్ చాలా క్లియర్ కట్ గా ఉంటుంది.రెండు రోజులు ఫ్రీ సబ్స్క్రిప్షన్.. వంటి స్కీమ్ లు పెడుతూ వినియోగదారులను పెంచుకోవడంలో చాలా దిట్ట. దీంతో నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ గ్రాఫ్ సంవత్సరం పొడవునా భారీ ఎత్తున పెరుగుతూ ఉంటాయి. కరోనా తర్వాత నెట్ ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్ ఊహించని రీతిలో పెరిగింది. దీంతో 1997 లో మొదలు పెట్టిన చిన్న సీడీ కంపెనీగా మొదలుపెట్టిన నెట్ ఫ్లిక్స్ సంస్థ 1,13,36,67,50,00,00 రూపాయల విలువ గల OTT దిగ్గజంగా… ప్రపంచంలో తిరుగులేని OTT సంస్థగా ఆవిష్కరించబడింది. మనదేశంలో కూడా నెట్ ఫ్లిక్స్ కంటెంట్ కి మంచి డిమాండ్ ఉంది.

World number one OTT Do you know the original history of Netflix
World Best OTT Netflix
లోకల్ టాలెంట్ నీ ప్రోత్సహించడం:

ప్రపంచవ్యాప్తంగా ఈ ఓటిటి సంస్థకి మంచి డిమాండ్ ఉండటంతో ఇండియాలో ప్రతిష్టాత్మక చిత్రాలు గత ఏడాది ఈ ఓటిటి ద్వారానే రిలీజ్ అయ్యాయి. ఈ క్రమంలో రాజమౌళి దర్శకత్వం వహించిన “RRR” నెట్ ఫ్లిక్స్ లో విడుదలై… అనేక రికార్డులు కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇదే సమయంలో నెట్ ఫ్లిక్స్ యాజమాన్యం మనదేశంలో లోకల్ భాషలను కూడా టార్గెట్ చేసుకుని భారీగా ఖర్చుపెట్టి.. రకరకాల కంటెంట్ లు కార్యక్రమాలు స్ట్రీమింగ్ చేస్తూ ఉంది. అంతేకాదు సినిమా ఇండస్ట్రీలో రావడానికి ఇంట్రెస్ట్ చూపించే వారి కోసం.. రకరకాల పోటీలు కూడా నిర్వహిస్తూ ఉంది. ఈ పోటీలో గెలిచిన వారికి 7 లక్షల రూపాయలు నిర్మాణం చేయటానికి.. ప్రోత్సహించే రీతిలో నెట్ ఫ్లిక్స్ ఆఫర్లు ఇస్తూ ఉంది. ఇక ఈ ఏడాది టాలీవుడ్ ఇండస్ట్రీలో నెట్ ఫ్లిక్స్ లో విడుదల అయ్యే సినిమాల లిస్టు చూస్తే త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న SSMB 28, భోళా శంకర్, ధమాకా, దసరా, అమిగోస్, యూవీ క్రియేషన్స్ సంస్థలో నవీన్ పోలిశెట్టి అనుష్క సినిమా, 18 పేజీస్, డీజే టిల్లు 2, విరూపక్ష.. వంటి సినిమాలు రిలీజ్ అవుతున్నట్లు ఇటీవల సంస్థ అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఒక విధంగా చూస్తే ఇండియాలో ఈ ఏడాది అత్యధిక ఓటిటి బిజినెస్ నెట్ ఫ్లిక్స్ కేంద్రంగా జరుగుతుందని చెప్పవచ్చు.


Share

Related posts

venkatesh: వెంకటేష్ అలా ప్ర‌వ‌ర్తిస్తార‌ని అనుకోలేదు.. బాలీవుడ్ బ్యూటీ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Tamannaah: వామ్మో.. త‌మ‌న్నా ఏంటి ఇలా మారిపోయింది..షాకిస్తున్న లేటెస్ట్ లుక్స్‌!

kavya N

మ‌రో సౌత్ రీమేక్‌కి అక్ష‌య్ సిగ్న‌ల్‌

Siva Prasad