Veera Simha Reddy: నరసింహం నందమూరి బాలయ్య బాబు కొత్త సినిమా “వీరసింహారెడ్డి” ప్రీ రిలీజ్ వేడుక ఒంగోలులో అంగరంగ వైభవంగా జరిగింది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా సంక్రాంతి పండుగ కానుకగా జనవరి 12వ తారీకు విడుదలకు సిద్ధమవుతోంది. ప్రీ రిలీజ్ వేడుకకు భారీ సంఖ్యలో అభిమానులు తరలిరావడం జరిగింది. ఈ వేడుకకు బాలకృష్ణ హైదరాబాద్ నుండి హెలికాప్టర్ ద్వారా రావడం తోపాటు అక్కడ అభిమానులతో ప్రత్యేకంగా భేటీ కావడం జరిగింది. ఇదిలా ఉంటే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బి.గోపాల్ హాజరయ్యారు.

ఆయన చేతుల మీదగా “వీరసింహారెడ్డి” ట్రైలర్ రిలీజ్ చేయడం జరిగింది. రాయలసీమ ఫ్యాక్షన్ నేపథ్యంలో సినిమా రూపొందించినట్లు ట్రైలర్ బట్టి తెలుస్తుంది. ట్రైలర్ లో బాలయ్య ద్విపాత్రాభినయం చేసినట్లు అర్థమవుతుంది. రెండు పాత్రలను కూడా ఈ ట్రైలర్ లో రివిల్ చేసేసారు. గోపీచంద్ మలినేని సినిమాలో బాలయ్య నీ చాలా పవర్ ఫుల్ పాత్రలో చూపించడం జరిగింది. ముఖ్యంగా బాలయ్య పెద్ద పాత్ర.. ట్రైలర్ మొత్తానికి హైలైట్ గా నిలిచింది. ఇక ట్రైలర్ లో బాలయ్య పలికిన మాస్ డైలాగ్స్… తమన్ అందించిన మ్యూజిక్.. చాలా ఆకట్టుకుంటూ ఉన్నాయి. బాలయ్య పెద్ద పాత్ర లుక్ కి తగ్గట్టు అదిరిపోయే డైలాగ్స్ రాయడం జరిగింది.

‘నాది ఫ్యాక్షన్ కాదు .. సీమ మీద ఎఫెక్షన్’ .. ‘పదవి చూసుకుని నీకు పొగరెక్కువేమో .. బై బర్త్ నా డీఎన్ ఏకే పొగరెక్కువ’, “ఓంటి చేత్తో ఊచకోత.. కోస్తా నా కొడకా..” వంటి డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదలవుతున్న “వీరసింహారెడ్డి” పై ట్రైలర్ మరింత అంచనాలు పెంచేయడం జరిగింది. “వీరసింహారెడ్డి” ట్రైలర్ కి భారీ ఎత్తున రెస్పాన్స్ వస్తుంది. ఈ సందర్భంగా సినిమాకి డైలాగులు రాసిన సాయి మాధవ్ బుర్ర మాట్లాడుతూ “నట సింహం వీరసింహమై గర్జిస్తే ఆ గర్జన ఎలా ఉంటుందో ‘వీరసింహా రెడ్డి’ అలా ఉంటుంది” అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే అంశాలు ఈ సినిమాలో ఉన్నాయని చెప్పుకొచ్చారు. యాక్షన్ ఎలిమెంట్స్ తో పాటు కామెడీ కూడా ఈ సినిమాలో భాగమని అన్నారు. ఇంకా బాలయ్య డైలాగ్ డెలివరీ గురించి హీరోయిన్ శృతిహాసన్ మరియు కన్నడ స్టార్ దునియా విజయ్ గురించి ప్రశంసిస్తూ.. సాయి మాధవ్ బుర్ర కీలక వ్యాఖ్యలు చేశారు. ఇటువంటి గొప్ప సినిమాకి పనిచేసే అవకాశం కల్పించిన దర్శకుడు గోపీచంద్ మలినేనికి కృతజ్ఞతలు తెలిపారు.