KGF 3: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసి రికార్డ్స్ క్రియేట్ సినిమాలలో “కేజిఎఫ్” మొదటి చాప్టర్ రెండో చాప్టర్ అని చెప్పవచ్చు. భారతీయ చలన చిత్ర రంగంలో అతి చిన్న ఇండస్ట్రీ కన్నడ ఇండస్ట్రీలో రూపొందిన “కేజిఎఫ్” మొదటి, సెకండ్ చాప్టర్ లు అనేక భాషలలో డబ్ అయి విడుదలైన ప్రతి చోట అనేక రికార్డులు క్రియేట్ చేయడం జరిగింది. ముఖ్యంగా నార్త్ బెల్ట్ బాలీవుడ్ ప్రేక్షకులు “కేజిఎఫ్” రెండు భాగాలకు బ్రహ్మరథం పట్టారు. యాష్ నటనకు బాలీవుడ్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. డైరెక్టర్ ప్రశాంత్ నీల్ టేకింగ్ కి…. బాలీవుడ్ మొదలుకొని సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీ వరకు సినిమా ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్థాయిని రాజమౌళి మాదిరిగానే ప్రశాంత్ నీల్ అమాంతం పెంచారని సినిమా చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే “కేజిఎఫ్ 2″ సినిమా క్లైమాక్స్ లో చాప్టర్ త్రీ ఉండబోతున్నాట్లూ హింట్ ఇవ్వడంతో…”కేజిఎఫ్ 3″ అప్డేట్ కోసం అభిమానులు ఎప్పటి నుండో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవలే హామ్ బెల్ నిర్మాణ సంస్థ అధినేతలు కూడా..”కేజిఎఫ్ 3” లో హీరో క్యారెక్టరైజేషన్ ఇంటర్ నేషనల్ లెవెల్ లో.. డిఫరెంట్ గా ఉండబోతుందని చెప్పుకొచ్చారు.
ఇదిలా ఉంటే ఇప్పుడు తాజాగా “కేజిఎఫ్ 3” ఈ సినిమా అధికారిక ప్రకటన చేయడానికి సినిమా యూనిట్ ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సరికొత్త వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. విషయంలోకి వెళితే డైరెక్టర్ ప్రశాంత్ నీల్ జన్మదినం జూన్ 4వ తారీకు నాడు “కేజిఎఫ్ 3” గురించి బిగ్ అప్ డేట్ రాబోతున్నాట్లూ టాక్ నడుస్తోంది. వీలైతే జూన్4 లేకపోతే జూన్ మూడవ తారీఖు నాడు “కేజిఎఫ్ 3” కి సంబంధించి ఓ వార్త రానున్నట్లు బలమైన టాక్ నడుస్తోంది.